ఆస్తుల వివరాలు చెప్పకపోతే 'నో' ప్రమోషన్

Updated By ManamWed, 12/27/2017 - 07:57
Money

Moneyన్యూఢిల్లీ: వచ్చే నెల నాటికి దేశంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులంతా తమ ఆస్తుల వివరాలను చెప్పాలని లేదంటే ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించి విజిలెన్స్ అనుమతులు నిలిపివేస్తానని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (డీవోపీటీ) హెచ్చరించింది. ఈ మేరకు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌లకు సూచించింది. 

దీని ప్రకారం 2018 జనవరి 31 నాటికి స్థిరాస్తులకు సంబంధించి రిటర్నులు (ఐపీఆర్‌) దాఖలు చేయాలని పేర్కొంది. ఐపీఆర్‌ దాఖలు చేయని అధికారులకు సంబంధించిన ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించిన విజిలెన్స్‌ అనుమతులు నిలిపివేస్తామని అడిషనల్ సెక్రటరీ పీకే త్రిపాఠి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక డీవోపీటీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,004 మంది ఐఏఎస్‌ అధికారులు పనిచేస్తున్నారు.

English Title
Centre makes it compulsory for IAS officers to declare their income and property
Related News