రాయపాటికి మరో షాక్

Updated By ManamSat, 08/11/2018 - 17:18
Rayapati sambasivarao
  • ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై సీజీఎస్‌టీ అధికారులు దాడులు

rayapati sambasiva rao

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరో షాక్ తగిలింది. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయంపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (సీజీఎస్‌టీ) అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బేగంపేట్, కమలాపురికాలనీలోని కార్యాలయాల్లో అధికారులు నిన్న (శుక్రవారం) సోదాలు జరిపారు.  రాయపాటికి చెందిన ఆ సంస్థ పన్నులు ఎగవేత కారణంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

కాగా సీజీఎస్‌టీ అధికారుల దాడులపై రాయపాటి సాంబశివరావు కూడా స్పందించారు. తమ కార్యాలయంపై జరిగిన దాడులు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తమ సిబ్బందికి జీఎస్టీ కట్టాలని ఎలాంటి సూచనలు లేనందున వారు దాన్ని విస్మరించారన్నారు. అయితే సీజీఎస్‌టీ అధికారులు ఆకస్మిక సోదాలతో వారు దిగ్ర్భాంతికి గురయ్యారన్నారు. మరోవైపు ఈ దాడులపై ట్రాన్స్‌ట్రాయ్ సిబ్బంది మాత్రం పెదవి విప్పడం లేదు.

English Title
CGST Team Raid Against Rayapati Sambasivarao transstroy company
Related News