చై, సామ్ కొత్త మూవీ ప్రారంభం

Updated By ManamMon, 07/23/2018 - 10:18
Chai, sam

Chai, sam చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భార్యాభర్తల బంధం కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆగష్టు నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. సాహు గారపాటి, హరీశ్ పెద్దలతో కలిసి కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా చై, సమంత కాంబోలో ఇప్పటికి ఏమాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య చిత్రాలు తెరకెక్కగా.. ఇది నాలుగో చిత్రం కానుంది. అలాగే పెళ్లి తరువాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

English Title
Chaitanya, Samantha new movie started
Related News