విప్లవమూర్తి ఐలమ్మ

Updated By ManamMon, 09/10/2018 - 00:53
chakali ilamma

imageవీర తెలంగాణ విప్లవాగ్ని, విప్లవమూర్తి ఐలమ్మ 33వ వర్ధంతి సభలను సెప్టెంబర్ 10న విప్లవపార్టీలు, ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించి విప్లవ స్ఫూర్తిని ప్రతి ఏటా చాటుతున్నాయి. పీడిత ప్రజానీకానికి ఐలమ్మ ఆనాడు చూపిన తెగువ, త్యాగం, పోరాటం నిత్యస్ఫూర్తిదాయకం. ఐలమ్మ ప్రతి ఘటన పోరాటాన్ని అందిపుచ్చుకోవాల్సిన చారిత్రిక కర్తవ్యాన్ని నవ తరం బాధ్యాయుతంగా స్వీకరించాల్సి వుంది.

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి ఐలమ్మ చాకలి వృత్తితో కుటుంబ పోషణ కష్టతరమైన నేపథ్యంలో వ్యవసాయాన్ని నమ్ముకుంది. మండలంలోని మల్లంపల్లి మక్తే దార్ కొండల్ రావు తల్లి జయప్రదా దేవి నుంచి పాలకుర్తిలోని భూమిని కౌలుకు తీసుకొని సాగుచేయటం మొదలెత్తింది. అప్పటికే పాలకుర్తిలో దొరల పీడనకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఆంధ్ర మహసభ (కమ్యూనిస్టు పార్టీ)లో ఐలమ్మ, ఆమె కొడు కులు సభ్యులయ్యారు. పాలకుర్తి పోలిస్ పటేల్ వీరమనేని శేష గిరిరావుతో విరోధం ఏర్పడింది. పోలిస్ పటేల్ వ్యవసాయ భూమిలో వెట్టిచేసేందుకు  ఐలమ్మ కుటుంబం నిరాకరించింది. ఫలితంగా ఆధిపత్య కులాల నుంచి ఐలమ్మ కుటుంబం సామా జికంగా, ఆర్ధకంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. మండలంలోని విస్నూరు గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని 60 గ్రామాలపై రాచ రిక పాలన సాగిస్తున్న విస్నూరు దేశ్ ముఖ్ రాపాక వెంకట రామచంద్రారెడ్డికి వీర విధేయుడు పాలకుర్తి పోలిస్ పటేల్ శేష గిరిరావు. పాలకుర్తి కేంద్రంగా కమ్యూనిస్టుల కార్యకలాపాలు పెరగటంతో ఉద్యమాల్ని అణచివేసేందుకు కుట్రలు జరిగాయి.

1945 శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాదిగా తరలి వచ్చే ప్రజలను చైతన్య పరిచేందుకు ఆంధ్రమహసభ ఆధ్వ ర్యంలో సభపెట్టగా దేశ్‌ముఖ్ దాన్ని విచ్ఛన్నం చేసి నాయ కులపై, కార్యకర్తలపై కుట్రకేసు పెట్టి జైల్లో పెట్టించాడు. ఇదే అదనుగా భావించి ఐలమ్మ భూమిని లాక్కోవాలని, పండించి న పంటను దోచుకోవాలని పన్నాగం పన్నారు. వేల ఎకరాల భూస్వామైన విస్నూర్ దొరకు ఐలమ్మ భూమి అవసరం లేదు. కానీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నామరూపం లేకుండా చేయా లంటే ఆ ఉద్యమానికి అండగా నిలిచిన ఐలమ్మను ఆర్ధికంగా దెబ్బతీస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని భావించారు. భూమి ని, పంటను దక్కించుకునేందుకు ఐలమ్మ నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు పార్టీ సహయాన్ని తీసుకొంది. పార్టీ లీడ్ తీసుకుని ఉద్యమ కార్యచరణను రూపొందించింది. అప్పటికే ఐలమ్మ భ ర్త చిట్యాల నర్సయ్య, ఇద్దరు కొడుకులు సోమయ్య, లచ్చయ్య లు కుట్రకేసులో ఇరికించబడి నల్లగొండ జైల్లో ఉన్నారు. దీంతో భయభ్రాంతులై పాలకుర్తిలో దొరలకు వ్యతిరేకంగా పని చేసేం దుకు ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఫలితం గా బయటి గ్రామాల నుంచి వలంటీర్లు, నాయకులు పాలకుర్తి కి చేరుకున్నారు. ఐలమ్మ ఇల్లే వారికి కేంద్రమైంది. ధైర్యం చెడిన కార్యకర్తల్లో వారంతా ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.

భూమిని, పంటను కాపాడుకోవడం కోసం ఐలమ్మ అధి కారులను కలిసింది. అయినా ఫలితం లేదు. దేశ్‌ముఖ్ రాం చంద్రారెడ్డి కుట్రలో భాగంగా ఐలమ్మ వరిధాన్యాన్ని దోచుకు రమ్మని గూండాలను 1945 నవంబర్‌లో పంపాడు. విషయం తెలిసిన  ఆంధ్ర మహాసభ నాయకులు, కార్యకర్తలు, వలంటీ ర్లు ఐలమ్మ భూమి దగ్గరకు చేరుకున్నారు. ఐక్యంగా నిలిచి దేశ్ ముఖ్ గూండాలను తరిమి కొట్టారు.  ఆ పొలంలో వరిపంట  కోసి, కుప్పకొట్టి వరిధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీం రెడ్డి నర్సింహరెడ్డి, దేవుళ్లపల్లి వెంకటేశ్వరరావు, చకిలం యాద గిరిరావు, జీడి సోమనర్సయ్య, ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి లాంటి ఆనాటి యువకిశోరాలు వీరోచితంగా పోరాడారు. వారిపై దొమ్మీకేసు పెట్టించిన 60 ఊర్ల దొర అభాసుపాలైండు. న్యాయ స్థానాల్లోను దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఓటమి చవిచూసిన రాంచంద్రారెడ్డి పాలకుర్తిపై దాడులు జరిపించాడు. ఐలమ్మ ఇంటిని లూటీ చేయించాడు. ఐలమ్మ కూతురు సోమ నర్సమ్మపై అత్యచారం చేశారు దేశ్‌ముఖ్ గుండాలు. ఎన్నో కిరాతక పనులు చేసినా ఐలమ్మ కుటుంబం, పాలకుర్తి ప్రజలు ఎర్రజెండాను వీడలేదు. కమ్యూనిస్టు పార్టీ పట్ల అచంచల వి శ్వాసాన్ని, నమ్మకాన్ని చూపారు.

ఐలమ్మ భూ పోరాటం కంటే ముందు కామారెడ్డిగూడెం లో షోక్ బందగీ దేశ్‌ముఖ్ గూండాల చేతిలో హత్యకు గుర య్యాడు. ఐలమ్మ భూపోరాటం తర్వాత కడవెండిలో దొడ్డి కొ మరయ్య అమరుడయ్యాడు. దీంతో రైతాంగ ఉద్యమం సాయు ద పోరాటంగా మలుపు తిరిగింది. ఈ పోరాటంలో నాలుగు వేలమంది అమరులు కాగా మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వ రాజ్యలేర్పాడ్డాయి. 10 లక్షల ఎకరాల భూమి పంచబడింది. ఆ మహత్తర పోరాటంలో విరోచిత భూమిక పోషించిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985న ఆనారోగ్యంతో మృతి చెందింది.

ఏ ఆశయం కోసమైతే ఐలమ్మ పోరాడిందో ఆ ఆశయాలు ఇంకా నెరవేరలేదు. ఐలమ్మను ఓటు బ్యాంకు రాజకీయాల కో సం బూర్జువ పార్టీలు వాడుకుంటుండగా విప్లవ పార్టీలు మాత్రం ఐలమ్మను చాంపియన్‌గా నిలుపుతున్నాయి. సాయు ధ పోరాటానికి మతం రంగును పులిమే మతతత్వ పార్టీ ఐల మ్మ పేరును హైజాక్ చేసే పనిలో ఉన్నది. ప్రత్యేకరాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఐలమ్మను నెత్తినెత్తుకున్న వాళ్లు తెలంగాణ తల్లిగా గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు. దోపిడీకి చిహ్నంగా ఉండే వ్యవసాయ మార్కెట్‌కు వీరనారి పెట్టి చేతులు దులుపుకున్నారు. ట్యాంకుబండ్‌పై విగ్రహం, స్మారక పార్కు, భవనం, మహిళా యూనివర్సిటీకి, జనగామ జిల్లాకు పేరు పెట్టాలనే డిమాండ్లు నిత్యం వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు కోరుతున్నప్పటికీ ఫలితం లేదు. ప్రజాకాంక్చలను నేరవేర్చా ల్సిన బాధ్యత ప్రజాస్వామిక ప్రభుత్వాలపై ఉన్నది.

దేశంలో మునుపెన్నడు లేని విధంగా ఆసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అసహనపు దాడులు పెరిగిపోయా యి. ఎన్డీఏ పాలనలో తీవ్రమైన భారం ప్రజలపై మోపబడిం ది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్వం మరింత ఖూనీ చేయబడుతున్నది. అణగారిన జనాలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. గో సంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్నారు. లౌకిక, ప్రజాతంత్రవాదుల్ని భౌతికంగా నిర్మూలిస్తున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని హిందూదేశంగా, రాజ్యంగాన్ని మనువాద రాజ్యాంగంగా మా ర్చేందుకు తీవ్ర ప్రయాత్నాలు ముమ్మరం చేశారు. ఫాసిజాన్ని నిలువరించేందుకు బలమైన ప్రజాఉద్యమాల్ని నిర్మించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్ర పాలన పోయి స్వపాలన వచ్చినా తిండి గింజల కోసం పోరాడక తప్పటం లేదు. స్వరాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియమాకాలు వస్తాయని చెప్పిన పాలకులు నేడు నోరు మెదపడం లేదు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన లేదు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు ప్రజలు దూరమవుతు న్నారు. ప్రశ్నించే హక్కుల్ని కోల్పోతున్నారు. కులాల వారీ తాయిలాలు ప్రకటిస్తూ విభజించి పాలించటం ప్రారంభిం చారు.  మాటల గారడీతో మభ్యపెడుతున్నారు. మేడిపండు చందంగా మోసపుచ్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజాకంటక పాలన కొనసాగిస్తోంది. కొత్త వాగ్దానాలు చేసే పనిలో మునిగారు. ప్రధాని మోదీ మాటలు కోటలు దాటుతుండగా, ఆచరణ గడప దాటడం లేదు. వీటన్నింటికీ వ్యతిరేకంగా పీడిత ప్రజా నీకాన్ని సమీకరించి సమరశీల పోరాటాల్ని నిర్మించాల్సిన కర్తవ్యం కమ్యూనిస్టు, విప్లవ శక్తులపై వున్నది. ఆ దిశలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విప్లవ స్ఫూర్తినందు కోవాలి. ఆనేక పోరాటాల ద్వారా తెలంగాణ సమాజం తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఆ పోరాటాల వెలుగు లోనే  సెప్టెంబర్ 10న కమ్యూనిస్టు ఐలమ్మ 33వ వర్థంతిని జయప్రదం చేద్దాం.

- మామిండ్ల రమేష్ రాజా
7893230218
(నేడు చాకలి ఐలమ్మ వర్థంతి)

English Title
chakali ilamma
Related News