చాంపియన్ జొకోవిచ్

Updated By ManamMon, 09/10/2018 - 22:40
Djokovic
  • సంప్రాస్ రికార్డు సమం చేసిన సెర్బియా ఆటగాడు 

  • యూఎస్ గ్రాండ్ శ్లామ్ ఓపెన్

imageన్యూయార్క్: సెర్బియా ఆటగాడు నోవక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-3, 7-6 (7/4), 6-3తో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను వరుస సెట్లలో ఓడించాడు. దీంతో 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలిచిన పీట్ సాంప్రాస్ రికార్డును సమం చేశాడు. ‘అతిపెద్ద టెన్నిస్ దిగ్గజాలలో సాంప్రాస్ ఒకడు. ఆయన నా చిన్ననాటి హీరో. ఆయన ఆటను చూస్తూ పెరిగాను. ఆయన తొలి రెండు వింబుల్డన్ పోటీలను టీవీల్లో చూశాను. ఆ స్ఫూర్తితోనే టెన్నిస్‌ను ఎంచుకున్నాను. ఈ గెలుపుతో ఫెడరర్ 20 టైటిళ్ల రికార్డుకు ఆరు విజయాల దూరంలో, నాదల్ 17 టైటిళ్ల దూరానికి మూడు టైటిళ్ల దూరంలో జొకోవిచ్ ఉన్నాడు. గతేడాది మోచేయి గాయం కారణంగా జొకోవిచ్ ర్యాంక్ కూడా పడిపోయింది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే క్రమంలో జొకోవిచ్‌కు చాలా అంశాలు కలిసొచ్చాయి. డ్రా కింది అర్ధ భాగంలో ఉన్న ఫెడరర్‌ను నాలుగో రౌండ్‌ను జాన్ మిల్‌మన్ ఓడించడంతో జొకోవిచ్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు డెల్ పొట్రోతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్ మోకాలి గాయం కారణంగా ఆట మధ్యలో తప్పుకోవడంతో జొకోవిచ్‌కు టైటిల్ మరింత సులువైంది. 

నాదల్, ఫెదరర్‌లకు రుణపడివుంటా
‘బహుశా పదేళ్ల కిందట అనుకంటా... ఈ యుగం ఆటగాళ్లు నాదల్, ఫెదరర్‌లతో అసంతృప్తిగా ఉన్నానని చెప్పాను. కానీ నేను ఈ రోజు ఓ గొప్ప ఆటగాడినయ్యాను. ఫెదరర్, నాదల్‌లతో వైరమే నన్ను గొప్ప ఆటగాడిగా నిలబెట్టింది. నన్ను నేను ఓ ఆటగాడిగా మలచుకునేందుకు వాళ్లతో వైరం ఉపయోగపడింది. నిజంగా వారికి నేనెంతో రుణపడివున్నాను’ అని జొకోవిచ్ అన్నాడు. ఈ టోర్నీకి ముందే జొకోవిచ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి వారంలో ఇక్కడి వేడిని తాళలేక ఇబ్బందిపడ్డ  చాలా మందిలో జొకోవిచ్ కూడా ఒకడు. తొలి రౌండ్‌లో హంగేరీకి చెందిన మార్టన్ ఫక్సోవిక్స్‌ను, రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన టెన్నిస్ సాండగ్రెన్‌ను చిత్తు చేశాడు. 
 

image

ఒలే నోల్
ఫైనల్స్‌కు చేరుకునే క్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన రిచర్డ్ గాస్కెట్‌తో, పోర్చుగల్‌కు చెందిన జోయావో సౌస, మిల్‌మన్, 2014 ఫైనలిస్ట్ కీ నిషికోరీలతో హోరా హోరీ పోరు కొనసాగించాడు. రెండో సెట్ ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఉన్నట్టుండి వరుసగా మూడు గేమ్‌లు కోల్పోయాడు. అయితే తర్వాత 20 నిమిషాల పాటు జరిగిన మారథాన్ గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. ఇందులో ఎనిమిదాస్లు డ్యూస్ కొనసాగింది. స్టేడియంలోని ప్రేక్షకులందరూ డెల్ పొట్రోకు మద్దతుగా నిలిచారు. ఫైనల్లో డెల్ పొట్రోతో పోరును హెవీవెయిట్ క్లాష్‌గా జొకోవిచ్ అభివర్ణించాడు. ‘ఈ మ్యాచ్‌లో కొన్నిసార్లు మెరుపు వేగంతో ఆట జరిగింది. ముఖ్యంగా రెండో సెట్‌లో మునివేళ్లపై ఆడాల్సివచ్చింది.  నన్ను నమ్మండి... పైకప్పు మూసేసినప్పుడు అభిమానుల ఆరుపులతో స్టేడియం దద్దరిల్లింది. ఆ శబ్దం ఆటగాడిపై గొప్ప ప్రభావం చూపుతాయి. అయితే చాలా ఫన్నీగా ఉండింది.

ఎందుకంటే నా నిక్ నేమ్ నోల్. కానీ అభిమానులు ఒలే.. ఒలే.. ఒలే.. ఒలే అని అరిచినప్పుడు నా పేరుimage ఉచ్చరించినట్టు అనిపించింది. అయినప్పటికీ వాటిన్నంటిని తట్టుకుని టైటిల్ గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని జొకోవిచ్ చెప్పాడు. అయితే ఫెడరర్ 20 గ్రాండ్ శ్లామ్ టైటిళ్ల రికార్డును జొకోవిచ్ సాధించాలని డెల్ పొట్రో ఆకాంక్షించాడు. ‘అతను ఖచ్చితంగా సాధిస్తాడు. ఇప్పటికే 14 టైటిళ్లు అతని ఖాతాలో ఉన్నాయి. అతను పూర్తి ఆరోగ్యంతో, ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఏడాదికి రెండు టైటిళ్లు గెలవగలడు. నేను, రాఫా, రోజర్ గ్రాండ్ శ్లామ్ టైటిళ్ల కోసం పోరాతామని భావిస్తున్నాను. ఎందుకంటే చరిత్ర సృష్టించడం కోసం జరిపే పోరాటం చాలా బాగుటుంది’ అని పొట్రో చెప్పాడు. 
 
Read also: 

English Title
Champion Djokovic
Related News