మూడు పార్టీలు నాపై ముప్పేట దాడి చేస్తున్నాయి

Updated By ManamThu, 03/22/2018 - 09:37
babu

chandrababu అమరావతి: మూడు పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్, మంత్రులు, పార్టీని టార్గెట్ చేస్తున్నారని.. అయినా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు అడుగుతుంటే కేంద్రం తనపై ఎదురుదాడి చేయిస్తుందని, ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని అన్నారు. 

తనపై కక్ష సాధింపు చర్యలు పెరుగుతున్నాయని, అన్నింటికీ సిద్ధంగా ఉండండి అంటూ పార్టీ నేతలకు సూచించారు. ఇక అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండా కేంద్రం పదేపదే వాయిదాలు వేస్తోందని.. ఉద్దేశపూర్వకంగానే వాయిదాల పర్వం కొనసాగుతోందని చెప్పారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు అవగాహన ఉందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.

English Title
Chandrababu comments on YCP< BJP, Janasena
Related News