ఫేక్ పార్టీ.. ఫేక్ ఫొటోలు.. ఫేక్ రాజకీయం

Updated By ManamMon, 04/16/2018 - 13:33
Babu, Jagan

Babu, Jagan అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైసీపీపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, ఆ పార్టీకి ఫేక్ రాజకీయం అని చంద్రబాబు విమర్శించారు. ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలతో ఆ పార్టీ ఫేక్ ప్రచారాన్ని చేస్తోందని అన్నారు. టీడీపీ సమన్వయ కమిటీ  సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే బీజేపీపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదన్న ముద్ర పడిందని, మొన్నటిదాక బీజేపీకి తిరుగులేదన్నారు కానీ ఇప్పుడు సీన్ మారిందని బాబు అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఓ ఎమ్మెల్యే చేసిన తప్పుకు బీజేపీ బద్నాం అయిందని, అహంభావం ఉంటే ఎంతటివారైనా పతనం అవుతారని పేర్కొన్నారు.
 

English Title
Chandrababu Naidu fire on YSRCP
Related News