అర్జంటుగా రూ.5 వేల కోట్లు పంపండి

Updated By ManamWed, 02/14/2018 - 21:57
 chandrababu

chandrababuఅమరావతి:  తమ రాష్ట్రానికి అర్జంటు‌గా రూ.5 వేల కోట్లు పంపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఇదేదో స్పెషల్ ప్యాకేజ్ నిధుల కోసమో.. విభజన హామీల్లో చెప్పిన లెక్కల సర్దుబాటు కోసమో కాదు.. దాని కథ వేరే ఉంది. కొద్దిరోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. ఏ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమో లేదంటే పెట్టిన నగదు క్షణాల్లో అయిపోవడమో జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు నాటి పరిస్ధితులు నెలకొన్నాయని.. ఏటీఎంలలో నగదు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణం రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల కరెన్సీని పంపాల్సిందిగా జైట్లీ లేఖ రాశారు.

English Title
chandrababu naidu letter to arun jaitley
Related News