‘లోకేశ్‌నూ చంద్రబాబు నమ్మలేని పరిస్థితి'

Updated By ManamMon, 03/19/2018 - 14:34
AP CM, Chandrababu naidu, Lokesh Babu, MP vijayasa reddy, AP special status

AP CM, Chandrababu naidu, Lokesh Babu, MP vijayasa reddy, AP special status న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన పార్లమెంట్‌ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రంగులు మారుస్తున్నారని విమర్శించారు. తన నీడను తానే నమ్మలేరని, లోకేశ్‌ను కూడా చంద్రబాబు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారని, అటువంటి వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ విన్యాసాలను ప్రజలంతా గమనిస్తున్నారని, అవసరాన్ని బట్టి పూటకో మాట మార్చడం ఆయన నైజమని ఆరోపించారు.

రాత్రికి రాత్రే ప్రెస్‌మీట్‌ పెట్టి అరుణ్‌ జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయి గుర్తుచేశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైసీపీనే అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం విషయంలో చంద్రబాబు ఎలా మాట మార్చారో అందరికీ తెలుసునని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.

English Title
Chandrababu naidu not believe even his son Lokesh babu, says MP Vijayasai reddy
Related News