త్యాగాలకు మారుపేరు తెలుగుదేశం

Updated By ManamSat, 09/08/2018 - 18:21
chandrababu naidu speech in NTR trust bhanvan
  • కార్యకర్తలకు పాదాభివందనాలు: చంద్రబాబు

  • కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది...

  • తెలంగాణలో టీడీపీ ఓ చారిత్రక అవసరం

  • కేసీఆర్, నాకు మధ్య మోదీ చిచ్చుపెట్టే యత్నం

chandrababu naidu speech in NTR trust bhanvanహైదరాబాద్: 36 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీని భుజాల మీద మోసిన పార్టీ కార్యకర్తలకు పాదాభివందనాలు చేస్తున్నాని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన తెలంగాణ టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని అన్నారు.

‘తెలంగాణలో టీడీపీ పార్టీ ఓ చారిత్రక అవసరం. ఇక్కడ కార్యకర్తలు ఎంతో పట్టుదలతో ఉన్నారు. త్యాగాలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ.  పార్టీని నిలబెట్టుకోవడానికి కార్యకర్తలు ముందుకు వచ్చారు.  భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనట్లుగా ...క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న పార్టీ ఒక్క టీడీపీయే. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.

విభజన చట్టంలో ఏపీకి అన్యాయం జరిగింది. సమన్యాయం అని మాట్లాడామే తప్ప, ఎవరికీ అన్యాయం చేయమని చెప్పలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుని, సీట్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఎలాంటి చర్చలు లేకుండా తెలంగాణలో బీజేపీ... పొత్తులకు అవకాశం లేదంటూ ప్రకటించింది. టీడీపీ ఎప్పుడూ అధికారం కోసం పాకులాడలేదు. 

తెలంగాణ ధనిక రాష్ట్రం కావడానికి టీడీపీ కష్టం ఉంది. అంతేకాదు రాష్ట్ర విభజన జరిగాక కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోవాలన్నదే నా ఆకాంక్ష. భారతదేశంలో ఏపీ, తెలంగాణ ...తొలి రెండు స్థానాల్లో నిలవాలి. విభజన తర్వాత నా మీద గురుతరమైన బాధ్యత నామీద ఉంది.

హైదరాబాద్‌లాగా ఏపీని కూడా అభివృద్ధిని చేయడం. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఘటన ఎన్టీఆర్. అలాగే పేద పిల్లలకు గురుకులాలు ఏర్పాటు చేసింది కూడా మన పార్టీయే. మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కూడా టీడీపీనే. ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలను తీసుకొచ్చాం. భావి తరాల భవిష్యత్ కోసమే ఇదంతా చేసాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తనకు మెచ్యూరిటీ లేదని మోదీ అంటున్నారని, అలాగే కేసీఆర్ కు పరిణితి ఉందని వ్యాఖ్యానిస్తూ తమ మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏపీని మోసం చేసిందని ఆయన అన్నారు. 

English Title
Chandrababu naidu speech In NTR Trust bhavan
Related News