‘మోస్ట్ లివబుల్ స్టేట్‌గా ఏపీ ఉండాలి’

Updated By ManamThu, 08/16/2018 - 13:11
chandrababu naidu
  • గ్రామదర్శినిపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

chandrababu niadu

అమరావతి :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం గ్రామదర్శినిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నోడల్ అధికారులు, కలెక్టర్లు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘గ్రామదర్శని ప్రారంభమై నెలరోజు అయింది. ఇంకా అయిదు నెలలు మాత్రమే ఉంది. గురు, శుక్రవారాల్లో అధికారులు అందరూ గ్రామాలు సందర్శించాలి. డిసెంబర్‌కల్లా ప్రజా సమస్యల్నీపరిష్కరించాలి. గ్రామాల్లో అందరి సహకారం తీసుకోవాలి. ప్రజలతో పలకరింపు బాగుండాలి. వారి యోగక్షేమాలు విచారించాలి. వారు ఎదుర్కొంటున్నసమస్యలు తెలుసుకోవాలి. 

అన్ని శాఖల్లో అంతర్గత ప్రక్షాళన జరగాలి. మూడు నెలల్లో ప్రతి ఇంటికి డోర్ నెంబర్, ప్రతి వీథికి సెన్సార్స్ ఏర్పాటు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీసింగ్ పటిష్టం కావాలి. ఇప్పుడు 5వేల సీసి కెమెరాలు ఉన్నాయి. మరో 23వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి. రోడ్లమీద ఎక్కడా మురుగునీరు ప్రవహించకూడదు. డ్రెయిన్ల నిర్మాణం ముమ్మరం చేయాలి. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో మనదే అగ్రస్థానం

ఈజ్ ఆప్ గెటింగ్ సిటిజన్ సర్వీసెస్‌లో మనమే ముందుండాలి. పౌరులకు అన్నిరకాల సేవలు అందుబాటులోకి రావాలి. ప్రపంచంలో మోస్ట్ లివబుల్ స్టేట్‌గా మన రాష్ట్రం రూపొందాలి. తినే తిండి, తాగేనీరు, పీల్చేగాలి స్వచ్ఛంగా ఉండాలి. నాణ్యమైన విద్యుత్, నాణ్యమైన నీరు,100% గ్యాస్ ఇస్తున్నాం. 

నాణ్యమైన జీవితం ప్రతిఒకరికీ అందుబాటులోకి తేవాలి. ప్రతిఒక్కరి హెల్త్ రికార్డు రూపొందించాలి. ప్రతి గ్రామం పర్యాటక కేంద్రం కావాలి.  పర్యాటకం పెంపొందాలి. కేంద్రప్రభుత్వం మన రాజధానికి రూ.1500కోట్లు మాత్రమే ఇచ్చింది. అదే బాండ్ల రూపంలో ఒక్కగంటలోనే రూ.2వేల కోట్లు వచ్చాయి. అదే రైతులు రూ.50వేల కోట్ల విలువైన భూములిచ్చారు. 

మన పాలనపై ప్రజల్లోఉన్ననమ్మకానికి అదే నిదర్శనం. మన ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి అదే రుజువు వర్షాలు బాగా పడుతున్నాయి. రిజర్వాయర్లలోకి నీటి చేరిక పెరిగింది. శ్రీశైలానికి లక్షా 78వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. వ్యవసాయ పనులు ముమ్మరం అయ్యాయి. రైతుల్లో ఆనందం నెలకొంది.’ అని అన్నారు.

English Title
Chandrababu naidu Teleconference On Grama Darshini
Related News