ఇందిరాగాంధీ స్టేడియంలో బాబు దీక్ష

Updated By ManamMon, 04/16/2018 - 11:29
babu

Babu అమరావతి: రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా తన పుట్టినరోజు(ఏప్రిల్ 20)నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్షను చేయనున్న విషయం విదితమే. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన ఈ దీక్షను చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ సమన్వయ కమిటీలో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక బాబు దీక్షకు మద్దతుగా తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీక్షను చేపట్టనున్నారు. అలాగే ఆ రోజు సాయంత్రం దళిత తేజం- తెలుగుదేశం బహిరంగ సభలోనూ చంద్రబాబు పాల్గొననున్నారు.

English Title
Chandrababu Naidu wiil do deeksha at Indira Gandhi Stadium, Vijayawada
Related News