పొత్తులపై స్వేచ్ఛనిచ్చా... మీ ఇష్టం: చంద్రబాబు

Updated By ManamSun, 09/09/2018 - 11:34
Chandrababu Naidu leaves decision on alliance with Congress
chandrababu niadu-telangana tdp leaders
  • తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు మరోసారి భేటీ

  • పొత్తులపై స్వేచ్ఛనిచ్చా... పార్టీని బలోపేతం చేయండి

  • పూర్తి సహకారం ఇస్తా...న్నికలకు సిద్ధం కండి

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులకు సంబంధించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో టీ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఇందుకోసం పలు కమిటీలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొత్తులపై పార్టీ నేతలకే స్వేచ్ఛ ఇస్తున్నానని, ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు సమిష్టిగా పనిచేసి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 

కాగా గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. బరిలోకి దిగుతున్న అన్ని పార్టీలో ఏదో ఒక పార్టీతో దోస్తీ కట్టడానికే ఉవ్విల్లూరుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్‌ను ఓడించాలని విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక బోఫోర్స్ కుంభకోణంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ప్రచారం చేసి ఆ పార్టీని వ్యతిరేకిస్తే... కేవలం టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో తెలంగాణ టీడీపీ జతకట్టేందుకు సిద్ధం అవుతోంది. 

కాగా తెలంగణాలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 90 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా, 29 స్థానాలను తెలంగాణ టీడీపీ అడుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం టీ టీడీపీకి 19 టికెట్లు ఇచ్చి మిగతావి తమతో పొత్తుకు వచ్చే ఇతర పార్టీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో టీ టీడీపీ నేతలతో చంద్రబాబు రెండోరోజు కూడా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఈ సమావేశంలో పొత్తులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English Title
chandrababu niadu meets again telangana tdp leaders over alliance with Congress in telangana
Related News