చంద్రబాబు పచ్చి అవకాశవాది

Updated By ManamSun, 04/15/2018 - 23:11
vijayasai
  • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  

imageవిశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని ఆయన విమర్శించారు. హోదా కోసం విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు దీక్ష చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆదివారం వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజీ హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, హోదాపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బంద్‌ల వల్ల ప్రయోజనం లేదని అంటున్న చంద్రబాబు.. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు బంద్‌కు పిలుపునిచ్చారో గుర్తుచేసుకోవాలని సూచించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, హోదా కల్పించిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్నెన్ని కంపెనీలు స్థాపించారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చంద్రబాబు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.

English Title
Chandrababu is a opportunistRelated News