చంద్రబాబు పచ్చి అవకాశవాది

Updated By ManamMon, 09/10/2018 - 23:54
jagan
  • సైంధవుడు.. ఓ మానసిక రోగి

  • ఆయన కంటే అవినీతిపరుడు లేడు.. ఎన్టీఆర్ ఆశయాన్ని హత్య చేశారు

  • బీజేపీపై విషం కుక్కుతున్నారు.. టీడీపీకి ఓ సిద్ధాంతం లేదు: కన్నా

jaganన్యూఢిల్లీ: చంద్రబాబు ప్రజల ముందు డ్రామాలాడుతున్నారని, ఆయన పచ్చి అవకాశవాది అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలపడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందని ఈ సందర్భంగా కన్నా గుర్తు చేస్తున్నారు. టీడీపీకి ఓ సిద్ధాంతం అంటూ లేకుండా పోయిందన్నారు. ప్రపంచంలో చంద్రబాబుకు మించిన అవినీతిపరుడు మరొకరు లేరన్నారు. ఆపరేషన్ గరుడ అంటూ కొత్త నాటకంతో ఓ సినీనటుడు ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలుపుతారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. 8, 9 తేదీల్లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఎన్నికల శంఖారావం పూరించామన్నారు. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీ రాహుల్‌తో అక్రమ సంబంధం నెరిపిందని తాము ముందు నుంచి చెబుతున్నామని కన్నా అన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి ఓబీసీ, ట్రిపుల్ తలాక్ బిల్లులు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు టీడీపీ వాటికి వ్యతిరేకంగా మాట్లాడిందన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు, పార్టీని విలువలతో నడిపిస్తున్నానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్ సిద్ధాంతాలను హత్య చేశారన్నారు. అపరిచితుడు మాదిరిగా చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. తెలుగు డ్రామా కంపెనీ అవకాశవాదాన్ని ప్రజలు గుర్తించాలని కన్నా కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను తీసుకుంటూనే టీడీపీ ప్రభుత్వంపై బీజేపీపై విషం కక్కుతుందన్నారు. అవకాశవాద పార్టీలు ఏపీకి అవసరం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు ఎప్పుడో గాలికి వదిలేశారని, అభివృద్ధికి అడ్డుపడుతూ ఆయన సైందవుడులా మారారని ఎద్దేవా చేశారు. త్వరలోని అన్ని జిల్లాలో పర్యటించి ఇంటింటికీ బీజేపీని చేరువ చేస్తామని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని కన్నా లక్ష్మీనారాయణ తెలియజేశారు.

English Title
Chandrababu is a virgin opportunist
Related News