వేపతో కేన్సర్‌కు చెక్

Updated By ManamThu, 06/21/2018 - 01:11
neem
  • ఇంజక్షన్ రూపంలోకి నింబోలైడ్

  • హైదరాబాద్‌లోని ‘నైపర్’ పరిశోధకుల ఘనత

imageహైదరాబాద్: ప్రాణాంతకమైన కేన్సర్‌ను వేప నయం చేయగలదని హైదరాబాద్ శాస్త్రవేత్తలు అంటున్నారు. వేపాకు, వేపపువ్వులోని నింబోలైడ్ అనే ఫైటో కెమికల్ కేన్సర్‌తో సమర్థంగా పోరాడగలదని వారు చెబుతున్నారు. భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదంలో వేపకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. ఆయుర్వేద శాస్త్రం వేపను చింతామణి, సర్వరోగ నివారిణి అని చెబుతోంది. వేపతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయని ఇప్పటికే ఆధునిక ఆరోగ్య నిపుణులు కూడా ఒప్పుకుంటు న్నారు. అయితే పలు రకాల కేన్సర్లను ఎదుర్కొవడంలో నింబోలైడ్ అద్భుతంగా పనిచేస్తుందని చాలా ఏండ్ల క్రితమే పలువురు శాస్త్రవేత్తలు గుర్తించారు. నింబోలైడ్‌ను నేరుగా తీసుకుంటే శరీరం దాని ఔషధ గుణాలను పూర్తిస్థాయిలో తీసుకోవడం లేదని, దీంతో దాని ప్రభావం తగ్గినట్టు పరీక్షల్లో తేలింది.

అయితే దాన్ని ఔషధ రూపంలోకి తీసుకురావడం సాధ్యం కాలేదు. అయితే హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) పరిశోధకులు ఈ నింబోలైడ్ రహస్యాన్ని ఛేదించేందుకు నడుం బిగించారు. మాత్రల రూపంలో ఇది ప్రభావాన్ని చూపకపోవడంతో వారు నింబోలైడ్‌తో ఇంజక్షన్ తయారు చేశారు. ఇది అద్భుతమైన ఫలితాలనిచ్చింది.

English Title
Check for cancer with neem
Related News