మోన్‌శాంటో ఎండీగా చెరుకూరి రవిశంకర్

Updated By ManamMon, 09/24/2018 - 22:20
Monsanto

Monsantoన్యూఢిల్లీ: బేయర్ గ్రూపు అనుబంధ సంస్థ మోన్‌శాంటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా చెరుకూరి రవిశంకర్ నియమితులయ్యారు. ఆయన ఇండియాతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక విభాగాల వ్యాపారాలను కూడా చూస్తారు.  అమెరికా కేంద్రంగా ఉన్న బయోటెక్ దిగ్గజం మోన్‌శాంటోని 63 బిలియన్ డాలర్లకు స్వాధీన పరుచుకునే ప్రక్రియను జర్మన్ ఫార్మా, రసాయనాల తయారీ సంస్థ బేయర్ ఏజీ ఈ ఏడాది జూన్‌లో పూర్తి చేసింది. తదనంతరం మోన్‌శాంటో ఇండియాలో చోటు చేసుకున్న ప్రధానమైన మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. మేనేజింగ్ డైరెక్టర్‌గా శిల్పా దివేకర్ నిరుల స్థానంలో రవిశంకర్ నియమితులయ్యారు. దివేకర్ నిరుల మాతృ సంస్థ బేయర్‌లో మరో సీనియర్ నాయకత్వ పదవిలోకి మారారు. అయితే, మోన్‌శాంటో ఇండియాకి ఆమె నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఇంతకు ముందు కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న రవి శంకర్ కంపెనీ వాణిజ్య, ఆధునికీకరణ, సరఫరా గొలుసు కార్యకలాపాలలో వ్యూహాత్మక చర్యలను రూపొందించి, అమలు పరచడంలో కీలక పాత్ర వహించారని కంపెనీ తెలిపింది. రవి శంకర్‌కు ఈ రంగంలో 21 ఏళ్ల అనుభవం ఉంది. విత్తనాల కంపెనీ మోన్‌శాంటో ఇండియా ఆరు దశాబ్దాలుగా ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తోంది.

Tags
English Title
Cherukuri Ravi Shankar as Monsanto Endy
Related News