వామ్మో.. మనిషి కడుపులో 100 చేప ముళ్లు..

Updated By ManamMon, 03/12/2018 - 19:42
Chinese doctor, removes 100 fish bones, man's rectum

Chinese doctor, removes 100 fish bones, man's rectum బీజింగ్‌: చైనా వైద్యచరిత్రలో ఓ అసాధారణ వైద్య కేసు వెలుగులోకి వచ్చింది. చైనా వైద్యులు ఓ వ్యక్తి కడుపులో నుంచి వంద చేప ముళ్లను తొలగించారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించిన వైద్యులు సూదుల్లాంటి ఆ చేపముళ్లను అతిజాగ్రత్తగా తొలగించారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన సెగజెజేరియన్ అనే వ్యక్తి గతవారం క్రితం విందులో ఉడికించిన చేపలను లొట్టలేసుకుంటూ లాగించేశాడు. జీర్ణాశయంలో అవే అరిగిపోతాయిలే అనుకున్నాడేమో చేప ముళ్లను నమలకుండా అలానే మింగేశాడు. కొద్దిరోజులకు అతని పొత్తికడుపులోని పెద్ద పేగులో భరించలేని నొప్పిరావడంతో విలవిలలాడిపోయాడు. చివరికి ఆస్పత్రికి వెళ్లగా అతడికి సీటీ స్కాన్ తీశారు. అందులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందవరకు చేప ముళ్లు ఉన్నట్టు గుర్తించిన వైద్యులే ఆశ్చర్యపోయారు.

‘ఒక వ్యక్తి కడుపులో భారీ మొత్తంలో చేప ముళ్లు ఉండటం చూడటం ఇదే తొలిసారి’ అని పశ్చిమ చైనా ఆస్పత్రి సిచువాన్ యూనివర్శిటీ వైద్యులు హుయాంగ్ జిహియిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత మేరకు అతని కడుపులోని చేప ముళ్లను తీసినప్పటికీ.. మరికొన్ని చేప ముళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. అందుకే మరికొన్నిరోజుల పాటు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోమని బాధితుడికి సూచించినట్టు హుయాంగ్ తెలిపారు. ఒకవేళ మలవిసర్జన సమయంలో మిగిలిపోయిన చేప ముళ్లు కూడా బయటకు వస్తాయో లేదో చూసి మరోసారి స్కాన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

English Title
Chinese doctor removes 100 fish bones from man's rectum
Related News