డైలమాలో ‘సైరా’ టీం

Updated By ManamThu, 09/06/2018 - 12:30
Sye Raa Narasimha Reddy

Sye Raa Narasimha Reddyమెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర క్లైమాక్స్ విషయంలో మూవీ యూనిట్ డైలమాలో పడ్డట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన నరసింహారెడ్డిని కోవెలకుంట్లలో అందరి ముందు ఉరితీశారు. అయితే సినిమాలో అలా చేస్తే చిరు అభిమానులు తట్టుకోలేరని భావించిన నిర్మాత, నటుడు రామ్ చరణ్.. హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని అన్నాడట. అయితే అలా చేస్తే సినిమా సరిగా ఉండదన్న ఉద్దేశ్యంలో దర్శకుడు ఉన్నాడట. దీంతో క్లైమాక్స్‌పై ఇంకా ఓ క్లారిటీకి రాలేదట. మరి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఏమంటారో చూడాలి.

English Title
Chiranjeevi Sye Raa team in dilemma
Related News