చాక్లెట్ డే

Updated By ManamFri, 02/09/2018 - 00:58
chocholet

chacoవాలెంటైన్ వీక్‌లో భాగంగా వచ్చే ‘వరల్డ్ చాక్లెట్ డే’ని ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు.  ఎవరైనా మనపై అలిగినా, మనల్ని మెచ్చుకున్నా మనం వారికి ప్రతిగా ఇచ్చేవాటిలో తప్పకుండా ఉండేవి చాక్లెట్లు.  చిన్నారులకు చాక్లెట్లంటే ఆరోప్రాణం.  మన జీవితంలో భాగమైన చాక్లెట్లంటే అందరికీ నోరూరుతుంది. ప్రపంచంలో ఫైనెస్ట్ చాక్లెట్లు బ్రెజిల్‌లో తయారవుతాయి. ఇక మనదేశంలోని అన్ని హిల్ స్టేషన్స్‌లోనూ చాక్లెట్లు ‘స్వగృహ’ పరిశ్రమగా ఉంది. ఊటీ, కొడై, కూర్గ్, నైనిటాల్ ఇలా ఏ కొండ ప్రాంతానికి వెళ్లినా ఇళ్లలో తయారు చేసిన బోలెడు ఫ్లేవర్ల చాక్లెట్లు విరివిగా దొరుకుతాయి. ఎవరిపైన అయినా మనకు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉన్నాయనుకొండి దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేందుకు చాక్లెట్లు మంచి సాధనం.  అందుకే గిఫ్ట్ ర్యాప్డ్ చాక్లెట్స్, చాక్లెట్ బొకేలు ఇలా వినూత్నమైన చాక్లెట్ గిఫ్ట్స మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.

English Title
chocholet dayRelated News