కల్లోలపరుస్తున్న ఫెడ్ విధానాలు

Updated By ManamMon, 02/12/2018 - 21:28
international stock market

international stock marketన్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కడచిన వారంలో తీవ్ర ఉత్థాన పతనాలకు లోనయ్యాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్.పి.ఐ)లు నికరంగా 938 మిలియన్ డాలర్ల విలువైన ఇండియన్ ఈక్విటీని విక్రయించారు. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని కట్టుదిట్టం చేసే (రుణాలను తగ్గించి, వడ్డీ రేట్లు పెంచడం) చర్యలకు దిగడంతో భారతదేశానికి వచ్చే విదేశీ ఫండ్ల నిధులు వచ్చే రెండు మూడేళ్ళలో తగ్గే అవకాశం ఉంది. దాదాపు సున్నా వడ్డీ రేట్లకే అవెురికాలో వ్యవస్థలోకి అపరిమితంగా నగదును ప్రవహింపజేయడం, డాలర్లలో ఇచ్చే రుణాలు ఇబ్బడిముబ్బడిగా పెంచేయడంతో ఆ నిధులు భారతదేశంతో సహా ప్రవర్థమాన మార్కెట్లలోకి ప్రవహించాయి. ప్రవర్థమాన మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలోకి 2010 నుంచి సుమారు 260 బిలియన్ డాలర్ల పోర్ట్‌ఫోలియో నిధులు ప్రవహించాయని, ఫెడరల్ రిజర్వ్ అనుసరించిన సంప్రదాయ విరుద్ధ విధానాలే దానికి కారణమని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్)కు చెందిన ప్రపంచ ఆర్థిక సిర్థత్వ నివేదిక వెల్లడించింది. ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తెచ్చే దిశగా ఫెడ్ అడుగులు వేస్తూండడంతో, ప్రవర్థమాన ఆర్థిక వ్యవస్థలలోకి  వచ్చే పోర్ట్‌ఫోలియో నిధులు ఏడాదికి సుమారు 35 బిలియన్ డాలర్ల మేరకు తగ్గిపోవచ్చని ఐ.ఎం.ఎఫ్ అంచనా వేసింది.
 
పటిష్టమైన సంబంధం
ఫెడ్ ద్రవ్య విధానాన్ని సడలింపజేయడానికి ఇండియాలోకి నిధులు ప్రవహించడానికి మధ్య పటిష్టమైన సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. అవెురికా ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్యతను చొప్పించడానికి ఫెడ్ 2009 నుంచి ఆస్తులు కొనుగోలు చేస్తూ వస్తోంది. దీనితో ఫెడ్ లాభాలు 2007 ఆగస్టులో ఉన్న 865 బిలియన్ డాలర్ల నుంచి 2014 అంతానికి 4.5 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. వడ్డీ రేటును అది 2006 జూన్‌లో ఉన్న 5.25 శాతం నుంచి 2008 డిసెంబరుకు 0.25 శాతానికి తగ్గించివేసింది. తక్కువ వడ్డీ రేట్లకు లభిస్తున్న రుణాలు తీసుకుని చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఆస్తుల తరగతులలో ఇన్వెస్ట్ చేశారు. అందులో కొంత నగదు ఇండియాకు కూడా వచ్చింది. భారతీయ ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో నిధులు 2009-2014 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా ప్రవహించాయి. ఆ కాలంలో సగటున ఏడాదికి 15 బిలియన్ డాలర్లు వచ్చిపడ్డాయి. అలాగే, 2010లో, 2012లో, 2013 సంవత్సరాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 20 బిలియన్ డాలర్లకు పైగా వచ్చి పడ్డాయి.  ఫెడ్ 2015లో ఆస్తుల్ని కొనడం ఆపేసి, 2015 డిసెంబర్ నుంచి వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించింది. భారతదేశంలోకి వార్షిక ఎఫ్.పి.ఐ ప్రవాహాలు కూడా 2015 నుంచి తగ్గిపోతూ వచ్చాయి. భారతీయ స్టాక్  మార్కెట్లు ఓ మోస్తరుగా బలమన పనితీరునే కనబరచినప్పటికీ, 2016లో, 2017లో సగటున 5 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. 

అవెురికా నుంచి ఎఫ్.పి.ఐలు
ఫెడ్ విధానాలతో ఇటువంటి పటిష్టమైన సంబంధం ఏర్పడడానికి బహుశా భారతీయ స్టాక్ మార్కెట్లు అవెురికా నుంచే ఎక్కువ పరిమాణంలో నిధులను అందుకుంటూండడం కారణం కావచ్చు. భారతీయ సెక్యూరిటీలు, ఎక్చ్సేంజ్ బోర్డు (సెబి) ప్రకారం, అవెురికాకు చెందిన ఎఫ్.పి.ఐలు 2017 డిసెంబర్ అంతానికి రూ. 9,82,055 కోట్ల విలుమైన షేర్లు కలిగి ఉన్నారు. భారతీయ ఈక్విటీలోని మొత్తం ఎఫ్.పి.ఐ హోల్డింగ్‌లో అది 35 శాతం వాటా కింద లెక్కకు వస్తుంది. భారతదేశంలోని మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో అవెురికాకు చెందిన ఎఫ్.పి.ఐల వాటా శాతం ప్రకారం చూస్తే 6.66గా ఉంటుంది. ఫెడ్ 2017 అక్టోబరు నుంచి ద్రవ్య విధానాన్ని కట్టుదిట్టం చేసే దిశగా కదులుతూండడంతో, విదేశీ నిధుల ప్రవాహాలపై ప్రభావం పడింది. ఫెడ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను ఇంకా పెంచవచ్చనే ఊహాగానాలు ఇంకా ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి. అవెురికాలో వడ్డీ రేటును 2015 డిసెంబరు నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు పెంచారు. వడ్డీ రేట్లు 1.25 నుంచి 1.5 శాతం స్థాయిలో ఉన్నాయి. అవి 2018 అంతానికి 2.1 శాతానికి, 2019 అంతానికి 2.9 శాతానికి పెరగగలవని అంచనా. 

English Title
Choking fed procedures
Related News