నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Updated By ManamWed, 03/14/2018 - 16:57
Closing Bell: Sensex ends off day low, banks support; IDBI jumps 14%

Closing Bell: Sensex ends off day low, banks support; IDBI jumps 14%ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు బ్యాంకుల సపోర్టుతో చివరకు నష్టాలతోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 21.04 పాయింట్లు నష్టపోయి 33,835.74 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 10,410.90 పాయింట్లకు చేరుకుని స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలతో నేటి ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.64.87వద్ద కొనసాగుతోంది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మిడ్ సెషన్ సమయానికి సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టాల్లోకి జారిపోయింది. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యస్‌ బ్యాంకు, టెక్‌ మహింద్రా, అంబుజా సిమెంట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 3 శాతం వరకు లాభపడగా, ఐడీబీఐ షేర్లు 14శాతంగా లాభపడింది. ఇక భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌, హీరో మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, టాటాస్టీల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టాలపాలయ్యాయి.

English Title
Closing Bell: Sensex ends off day's low on banks' support; IDBI jumps 14%
Related News