లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Updated By ManamMon, 04/16/2018 - 16:40
Sensex gains 113 pts, Nifty ends above 10,500; Tata Motors dips 5%

Sensex gains 113 pts, Nifty ends above 10,500; Tata Motors dips 5% ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 113 పాయింట్లు లాభపడి 34,305 వద్ద, నిఫ్టీ 47.80 పాయింట్ల లాభంతో 10,528.40 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం ఉదయం ఆరంభ ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ దాదాపు 250 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ కూడా పతనమైంది. అంతలోనే మళ్లీ తేరుకున్నాయి. మదుపర్ల కొనుగోళ్ల అండతో మళ్లీ లాభాల బాట పట్టాయి. మధ్యాహ్నం సెషన్‌లో నష్టాల నుంచి తేరుకుని లాభాల బాట పట్టాయి.

ఎన్ఎసీఈలో సిప్లా, గ్రాసిమ్, హీరోమోటార్స్, యూపీఎల్, ఎన్టీపీసీ షేర్లు 5 శాతం మేర లాభపడ్డాయి. ఇక టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం మేర పతనమయ్యాయి. ఇన్ఫోసిస్ షేరు మాత్రం 3 శాతం నష్టంతో ముగిసింది. విప్రో, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ ఒత్తిడిలో కొనసాగుతూ నష్టాలను చవిచూశాయి. డీసీబీ బ్యాంక్, జైన్ ఇరిగేషన్, జేఎస్పీఎల్, డిష్ టీవీ, ఇండియాబుల్స్, రియల్ ఎస్టేట్ 6 శాతం మేర లాభాలు పండించాయి.

English Title
Closing Bell: Sensex gains 113 pts, Nifty ends above 10,500; Tata Motors dips 5%
Related News