పాడె మోసిన చంద్రబాబు..

Updated By ManamThu, 08/30/2018 - 16:02
CM Chandrababu naidu, HariKrishna funerals, Jasthi Chalameswar, NTR, Kalyanram, Prajaradham
  • సీఎంతో పాటు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్

  • అధికార లాంఛనాలతో కొనసాగిన హరికృష్ణ అంతిమయాత్ర.. 

CM Chandrababu naidu lifts brother in law HariKrishna 

హైదరాబాద్: దివంగత నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మెహదీపట్నం నుంచి జూబ్లీహీల్స్ మహాప్రస్థానం వరకు హరిక్రిష్ణ అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజా రథం వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ పార్థీవదేహాన్ని మోసారు.

ఆయనతో పాటు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కూడా పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు పాడె మోస్తుంటే.. మరోవైపు జాస్తి చలమేశ్వర్ మోస్తూ ముందు నడిచారు. హరికృష్ణ పార్థీవదేహం వెంట ఆయన కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, కుటుంబ సభ్యులు మందుకు సాగారు. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారి లాంఛనాలతో హరికృష్ణ అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. 

English Title
CM Chandrababu naidu lifts brother in law HariKrishna 
Related News