‘సైలెంట్‌గా కూర్చుంటే ఇక కుదరదు’

Updated By ManamSun, 02/04/2018 - 13:21
CM Chandrababu Naidu serious on Centre

CM Chandrababu Naidu serious on Centreఅమరావతి: కేంద్రం ఏం చేస్తున్నా మనం ఇంకా సైలెంట్‌‌గా కూర్చుంటే కుదరదనీ.. మనం కూడా ఎదురుదాడికి దిగాలన్నట్లుగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టీడీపీ ఎంపీలు, మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. సుమారు రెండుగంటలుగా జరుగుతున్న ఈ సమావేశంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దశలవారీ ఆందోళనలు చేయాలని ఎంపీలు సూచించగా మరికొందరు రాజీనామా చేయాల్సిందేనని ఇంకొందరు ఎంపీలు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించాలని మరికొందరు ఎంపీలు.. సీఎంకు సూచించారు.

"ప్రధాని మోదీ ఫొటోలు పెట్టలేదని కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అదంతా నిజం కాదన్నారు. పార్టీలకతీతంగా కేంద్ర బడ్జెట్‌ను అందరూ వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇంకా నాటకాలాడుతున్నారు. వీటన్నింటిపైనా ప్రజలకు నిశితంగా వివరించండి. నాలుగు బడ్జెట్ల తర్వాత కూడా ఇంకా సహనం ఎక్కడుంటుంది?. ఏపీని ప్రత్యేకంగా చూడాలని చాలాసార్లు కేంద్రానికి చెప్పాను. నియోజకవర్గాల పునర్విభజన అసలు సమస్యేకాదు. విభజన చట్టంలో పెట్టారు కాబట్టి అడుగుతున్నాం అంతే. దాన్ని ప్రధానాంశంగా తీసుకుని మీరెవరు మాట్లాడొద్దు" అని పార్లమెంటరీ సమావేశంలో మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

English Title
CM Chandrababu Naidu serious on Centre
Related News