కేంద్రం తీరుపై అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం

Updated By ManamTue, 03/13/2018 - 20:24
cm chandrababu

cmఅమరావతి: ఏపీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం చంద్రబాబు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదాతో దక్కేవన్నీ ఏపీకి ఇస్తే తప్ప తమ ఆందోళనను విరమించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తీర్మానంలో సీఎం కోరారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకూ పోరాడతానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తినని.. రాష్ట్రానికి ఏం కావాలో తనకు తెలీదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రైల్వే జోన్ ఇవ్వలేమని ఓ రైల్వే అధికారి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. సెంటిమెంట్స్‌తో డబ్బులు ఇవ్వలేమని చెబుతున్న అరుణ్ జైట్లీకి అదే సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ఏపీని విభజించిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు.  హోదా ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు చెప్పారు.

English Title
cm chandrababu passed a resolution in ap assembly
Related News