ఒక్కరోజు రైతుగా సీఎం..

Updated By ManamSat, 08/11/2018 - 21:27
CM HD Kumaraswamy, participates in paddy sowing program, 
  • రైతులతో పాటు పొలంలో వరినాట్లు వేసిన కుమారస్వామి

  • మండ్యం జిల్లాలో పర్యటించిన కర్ణాటక ముఖ్యమంత్రి 

CM HD Kumaraswamy, participates in paddy sowing program, బెంగళూరు: కర్ణాటక సీఎం కుమారస్వామి ఒక్కరోజు రైతుగా అవతరమెత్తారు. రైతులతో పాటు పొలంలో దిగి వరినాట్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షం నిలబడుతుందనే సందేశం ఇచ్చేందుకు సీఎం రైతులతో మమేకమయ్యారు. మండ్య జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన సీతాపుర గ్రామంలోని రైతులతో కలిసి పంట పొలానికి వెళ్లారు. అక్కడి రైతుకూలీలతో కలిసి వరినాట్లు వేశారు. తరువాత రైతులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా పంట రుణాలు, వర్షాలు, గిట్టుబాటు ధరల గురించి రైతన్నలను ఆరా తీశారు. సీఎం కుమారస్వామితో పాటు జేడీయూ కార్యకర్తలు, 150 మంది రైతులు ఉన్నారు.

రైతులకు అవసరమైన సహాయం చేసేందుకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని సీఎం హామి ఇచ్చారు.  ‘నేను ఓ రైతునే. మా నాన్న దేవె‌గౌడ కూడా పేద రైతు. రైతుల సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేను యువకుడిగా ఉన్న సమయంలో వ్యవసాయం చేశాను. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక రైతుగా పొలంలో అడుగుపెట్టాను. చాలా సంతోషంగా ఉంది’ అని సీఎం కుమారస్వామి చెప్పారు. 

English Title
CM HD Kumaraswamy participates in paddy sowing program at Sitapura
Related News