సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష!

Updated By ManamWed, 06/13/2018 - 15:04
ramesh

ramesh న్యూఢిల్లీ  : కడప స్టీల్ ఫ్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సమావేశం పెట్టినా అంత ఆశాజనకంగా లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ అడిగామని, ఇందుకు సంబంధించి అన్ని అంశాలు ప్రస్తావిస్తామన్నారు. అప్పటికీ  స్పందించకపోతే కడపలో అన్ని వర్గాలవారిని కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఆంధ్ర ప్రజలు బాధపడుతున్న కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా అంటూ వైసీపీ రాజీనామాల డ్రామా  కొనసాగుతోంది, కనీసం రాజీనామాలు ఆమోదింపజేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వారి రాజీనామాలు  ఆమోదం పొందినా ఎన్నికలు రావని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తే 24 గంటల్లో ఆమోదించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ పార్లమెంట్ లో అవిశ్వాసం పెడతామన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్  పనులను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని, పోలవరం ఆంధ్ర, రాయలసీమకు ఒక వరం అని అన్నారు.
 

English Title
CM Ramesh ready to hunger strike
Related News