బొగ్గు నిల్వలతో హిందాల్కోలో ధీమా

Updated By ManamSat, 09/22/2018 - 22:18
aditya-birla-hindalco

aditya-birla-hindalcoముంబై: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ హిందాల్కో ఉత్పాదక సామగ్రి ధరవరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వస్తోంది. లింకేజ్ వేలాల్లో అది దాదాపు 3.2 మిలియన్ టన్నుల బొగ్గును పొందింది. దాని వార్షిక అవసరాల్లో 71 శాతం తీర్చడానికి ఆ బొగ్గు నిల్వలు సరిపోతాయి. ఉత్పాదక సామగ్రిని తక్కువ ధరలకు సమకూర్చుకుంటే, మొత్తంమీద ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, అన్ని విభాగాలు మెరుగైన సామర్థ్యంతో పనిచేసేట్లు చేసుకోవచ్చని హిందాల్కో  చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. లింకేజ్ వేలాల్లో దాదాపు 3.2 మిలియన్ టన్నుల బొగ్గును పొందినట్లు ఆయన తెలిపారు. దీనితో కంపెనీ లింకేజీల ద్వారా సమీకరించుకున్న  బొగ్గు మొత్తం 11.9 మిలియన్ టన్నులకు చేరింది. హిందాల్కో దాదాపు రూ. 8,000 కోట్ల దీర్ఘకాలిక రుణాలు తీర్చింది. అల్యూమినియం ధరలు అధిక స్థాయిల్లోనే ఉంటాయని కంపెనీ భావిస్తోంది. చైనా వెలుపల అల్యూమినియం సరఫరాలో పది లక్షల టన్నుల లోటు ఉండగలదని, చైనా లోపల కూడా 0.5 మిలియన్ టన్నుల కొరత ఉండగలదని కంపెనీ అంచనా. 

English Title
Coal stock reserves in Hindalco
Related News