ఈ నెలలోనే ‘కలర్స్’ స్వాతి పెళ్లి

Updated By ManamMon, 08/13/2018 - 12:47
Swathi

Swathi ప్రముఖ నటి కలర్స్ స్వాతి త్వరలో ఏడడుగులు వేయనుంది. గత కొంత కాలంగా వికాస్ అనే వ్యక్తితో స్వాతి ప్రేమలో ఉండగా.. తాజాగా ఈ ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపాయి. అంతేకాదు వీరి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆగష్టు 30న హైదరాబాద్‌లో వివాహం జరగనుండగా.. సెప్టెంబర్ 2న కొచ్చిలో రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం.

అయితే ఇండేనేషియా రాజధాని జకార్తాకు చెందిన వికాస్, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా పనిచేస్తున్నారు. వివాహం తరువాత స్వాతి కూడా అక్కడే స్థిరపడనున్నట్లు తెలుస్తోంది. కాగా కలర్స్ అనే టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన స్వాతి ఆ తరువాత డేంజర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టా చెమ్మా, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, లండన్ బాబులు వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే.

English Title
Colours Swathi getting knot this month
Related News