హీరోగా కమెడియన్ యోగి బాబు 

Updated By ManamMon, 09/10/2018 - 17:50
yogi babu

yogi babu

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్నట్లు...అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలనేది ఏ రంగానికి అయినా వర్తిస్తుంది. ఇప్పుడు అదే సూత్రాన్ని కోలీవుడ్ హాస్యనటుడు యోగిబాబు కూడా ఫాలో అవుతున్నట్లు ఉంది. రెమో చిత్రంలో హాస్యనటుడుగా తెలుగు ప్రేక్షులకు దగ్గర అయిన యోగిబాబు త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

తమిళ్ ఇండ్రస్టీలో స్టార్ హీరోలకన్నా బిజీ షెడ్యూల్‌లో ఉన్న యోగిబాబు ఖాతాలో ప్రస్తుతం 17 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఓ ఐడెంటిటీని సొంతం చేసుకున్న అతడు తమిళ్ ‘డార్లింగ్’ ఫేమ్ డైరెక్టర్ సామ్ ఆంటోనీ...  యోగిబాబుని హీరోగా పరిచయం చేయబోతున్నారట. అయితే ఈ వార్త అధికారికంగా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం సామ్ ఆంటోనీ ‘100’ సినిమా తీస్తూ బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తి కాగానే యోగిబాబుతో సినిమా మొదలుపెట్టనున్నారట. కాగా తెలుగు, తమిళ చిత్రరంగంలో ఇప్పటికే పలువురు హాస్యనటులు... ఆ తర్వాత కాలంలో హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొందరు హీరోలుగా నిలదొక్కుకున్నారు కూడా. మరి యోగి ఏ మేరకు సక్సెస్ అవుతాడో వేచి చూడాల్సిందే.

English Title
comedian yogi babu to be hero in new film
Related News