సుత్తి.. హస్తం.. సైకిలు పొత్తుకు సై..!

Updated By ManamTue, 09/11/2018 - 19:51
Congress, CPI, TDP, Mass Alliance, Telangana state
  • మహాకూటమిగా ముందస్తుకు విపక్షాలు..

  • త్వరలో ఢిల్లీకి వెళ్లనున్న మూడు పార్టీల నేతలు 

Congress, CPI, TDP, Mass Alliance, Telangana stateహైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీగా విపక్షాలు మహాకూటమిగా అవతరించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మధ్య పొత్తు ఖరారు అయింది. త్వరలో ఢిల్లీకి మూడు పార్టీల నేతలు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక, ఎన్నికల కమిషన్ నిపుణులను కూడా నేతలు కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. మూడు పార్టీలు కలిసి కామన్ మేనిఫెస్టో విడుదల చేసే యోచనలో విపక్ష నేతలు కసరత్తు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. అన్ని పార్టీల నేతలంతా కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేఫథ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన అఖిలపక్షం నేతలు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని సూచించినట్టు తెలిసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటే ఎన్నికలు నిస్పక్షపతంగా జరగవని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 

కేసీఆర్‌ను తొలగించాల్సిందే: ఉత్తమ్
ప్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తొలగించాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రే ఎన్నికల షెడ్యూల్‌ని ఎలా ప్రకటిస్తారని ఉత్తమ్ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ను ఒక అధికారి టీఆర్ఎస్ తరపున ఏ విధంగా కలిసి అడుగుతారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఈసీ స్టుపిడ్ అండ్ సిల్లీగా పేర్కొందని అన్నారు. 

మోడీతో కుమ్మక్కై కేసీఆర్ ముందస్తుకు..: ఎల్ రమణ
ప్రధాని నరేంద్ర మోదీతో కుమ్మక్కై కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. కుటుంబ రాజకీయ మనుగడ కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపైనా దాడులు జరిగాయని అన్నారు. ముందస్తుపై రాష్ట్రపతిని కూడా కలవాలని నిర్ణయించినట్టు తెలిపారు. జాతీయ స్థాయి పార్టీలనూ కలుస్తామన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని తొలగిస్తేనే ప్రజాస్వామ్య మనుగడ ఉంటుందని రమణ తెలిపారు.

కాగా, 20 లక్షలకు పైగా ఓటర్ల పేరు గల్లంతయ్యాయని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ తమ అభ్యర్థనపై స్పందించలేదని కోదండరాం తెలిపారు. 

English Title
Congress, CPI, TDP to be making as Mass Alliance in Telangana state
Related News