దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరాహారదీక్షలు

Updated By ManamFri, 04/06/2018 - 18:31
congress flag representational

congress flag representationalన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ శ్రేణులు అందుకు సిద్ధమవ్వాలని సూచించింది. దళితుల భారత్ బంద్ సందర్భంగా తలెత్తిన హింసకు వ్యతిరేకంగా 9వ తేదీన దేశవ్యాప్త నిరాహార దీక్షలను చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకే ఈ దీక్షను చేపడుతున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. నిరాహారదీక్షకు సంబంధించి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఏప్రిల్ 9 (సోమవారం)న అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ సూచించారు. ‘‘శాంతి, సామరస్యాలే ఈ దేశానికి ఆత్మ. దానిని కాపాడే బాధ్యత కాంగ్రెస్‌దే’’ అని కాంగ్రెస్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. హింసను అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ఆ బాధ్యతను కాంగ్రెస్ భుజానికెత్తుకుంటోందని పేర్కొంది. 

English Title
congress to fasting protests across the country
Related News