74 మంది అభ్యర్థులు ఖరారు: కాంగ్రెస్  

Updated By ManamFri, 11/09/2018 - 07:00
Congress finalise, 74 candidates, Assembly Elections, TJS, CPI, Telangana Assembly elections
  • ముగిసిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

  • రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా

  • 93 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్.. భాగస్వామ్య పక్షాలకు 25

  • 10న 74 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా 

  • 14 టీడీపీ, 8 టీజేఎస్, సీపీఐ 3 స్థానాలు

  • తెలంగాణ ఇంటి పార్టీకి 1 స్థానం కేటాయింపు 

Congress finalise, 74 candidates, Assembly Elections, TJS, CPI, Telangana Assembly electionsన్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలకు కేటాయించే సీట్ల విషయంపై కూడా కాంగ్రెస్‌ స్పష్టతనిచ్చింది. గురువారం సోనియా గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 74 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇప్పటికే 54 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మరో 20 మంది అభ్యర్థులను పార్టీ హైకమాండ్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇందులో 14 టీడీపీ, 8 టీజేఎస్, 3 సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీకి 1 స్థానాన్ని నిర్ణయించినట్టు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా వెల్లడించారు. ఈ నెల 10న 74 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేయనున్నట్టు  వెల్లడించారు. భాగస్వామ్యపక్షాలకు మొత్తం 25 సీట్లు కేటాయించినట్టు చెప్పారు. మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీలో కసరత్తు చేసిన కాంగ్రెస్ నేతలు.. ఈ నెల 11 తరువాత మిగతా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు.

స్ర్కీనింగ్ కమిటీ అందజేసిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సీఈసీ పరిశీలించింది. దాంతో 11న ఫైనల్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో మొత్తం 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. సీపీఐకి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ స్థానాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో రేపు (శుక్రవారం) సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది.  టీజేఎస్ అధినేత కోదండరాంకు ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో కోదండరాంను ఢిల్లీకి రావాలని ఏఐసీసీ కోరినట్టు సమాచారం.  

టీజేఎస్ పోటీ చేసే స్థానాలు ఇవే..
వరంగల్ ఈస్ట్-గాదె ఇన్నయ్య
మల్కాజ్ గిరి-దిలీప్
మెదక్-జనార్ధన్ రెడ్డి
దుబ్బాక-రాజ్ కుమార్
సిద్ధిపేట-భవానీ
మహబూబ్ నగర్-రాజేందర్ రెడ్డి
చెన్నూరు, మిర్యాలగూడ పెండింగ్
ఇక తెలంగాణ ఇంటి పార్టీ పోటీ చేసే ఒక స్థానం నకరేకల్

స్థానాల వారీగా అభ్యర్థుల పేర్లు... 
ఆదిలాబాద్ జిల్లా
1.సిర్పూర్    పి. హరీష్‌రావు
2.అసిఫాబాద్ (ఎస్‌టీ)    ఆత్రం సక్కు
3.ఖానాపూర్ (ఎస్‌టీ)    రమేష్‌రాథోడ్
4.అదిలాబాద్    గంట్రోతు సుజాత
5.బోద్ (ఎస్‌టీ)    సోయం బాబురావు
6.నిర్మల్    మహేశ్వర్‌రెడ్డి
7.ముధోల్    రామారావుపటేల్
8.చెన్నూరు (ఎస్సీ)     వెంకటేశ్ నేత
9.బెల్లంపల్లి (ఎస్సీ)     శంకర్
10.మంచిర్యాల్    పెండింగ్
కరీంనగర్ జిల్లా
1.ధర్మపురి (ఎస్సీ)    పెండింగ్
2.జగిత్యాల్    టి. జీవన్‌రెడ్డి
3.కోరుట్ల    జువ్వాది నర్సింగ్‌రావు
4.రామగుండం    పెండింగ్
5.మంథని    శ్రీధర్‌బాబు
6.పెద్దపల్లి    విజయరామారావు
7.కరీంనగర్    పొన్నం ప్రభాకర్
8.చొప్పదండి (ఎస్సీ)    మోడిపల్లి సత్యం
9.వేములవాడ    ఆది శ్రీనివాస్
10.సిరిసిల్లా    కె.కె. మహేందర్‌రెడ్డి
11.మానకొండూరు    ఆరెపల్లి మోహన్
12.హుజూరాబాద్    కౌశిక్ రెడ్డి
13.హుస్నాబాద్    ప్రవీణ్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా
1.ఆర్మూర్     పెండింగ్
2.బోధన్    సుదర్శన్‌రెడ్డి
3.నిజామాబాద్ అర్బన్    మహేశ్ కుమార్ గౌడ్
4.నిజామాబాద్ రూరల్    పెండింగ్
5.బాల్కొండ    అనిల్
6.జుక్కల్(ఎస్సీ)    గంగారామ్
7.బాన్స్ వాడ     బాలరాజు
8.ఎల్లారెడ్డి    పెండింగ్
9.కామారెడ్డి    షబ్బీర్ అలీ
మెదక్ జిల్లా
1.నారాయణ్‌ఖేడ్    పెండింగ్
2.ఆందోల్ (ఎస్సీ)    దామోదర రాజనర్సింహ
3.జహీరాబాద్ (ఎస్సీ)     గీతారెడ్డి
4.సంగారెడ్డి    జగ్గారెడ్డి
5.పటాన్‌చెరు    పెండింగ్
6.మెదక్    విజయశాంతి
7.నర్సాపూర్    సునితా లకా్ష్మరెడ్డి
8.సిద్దిపేట    టీజేఎస్
9.దుబ్బాక    టీజేఎస్
10.గజ్వేల్    వి.ప్రతాప్‌రెడ్డి
వరంగల్ జిల్లా
1.వరంగల్ వెస్టు    పెండింగ్
2.వరంగల్ ఈస్టు    టీజేఎస్
3.వర్దన్నపేట (ఎస్సీ)    టీజేఎస్
4.భూపాలపల్లి    గండ్ర వెంకట రమణారెడ్డి
5.పర్కాల్    కొండా సురేఖ
6.నర్సంపేట    దొంతి మాధవరెడ్డి
7.మహబూబాబాద్    బలరామ్‌నాయక్
8.ములుగు    సీతక్క
9.జనగాం    పొన్నాల లక్ష్మయ్య
10.పాలకుర్తి    జంగా రాఘవ రెడ్డి
11. డోర్నకల్    రామచందర్ నాయక్
12.స్టేషన్ ఘన్‌పూర్         ఇందిర
మహబూబ్‌నగర్ జిల్లా
1.కొడంగల్    రేవంత్‌రెడ్డి
2.నారాయణ్‌పేట    శివకుమార్‌రెడ్డి
3.మహబూబ్‌నగర్    పెండింగ్
4.జడ్చర్ల    మల్లు రవి
5. దేవరకద్ర    పెండింగ్
6.మక్తల్    టీడీపీ
7.షాద్‌నగర్    ప్రతాప్‌రెడ్డి
8.వనపర్తి    చిన్నారెడ్డి
9.గద్వాల    డి.కె, అరుణ
10.అలంపూర్    సంపత్
11.నాగర్ కర్నూల్    నాగం జనార్ధన్‌రెడ్డి
12.అచ్చంపేట    వంశీకృష్ణ
13.కల్వకుర్తి    వంశీచందర్‌రెడ్డి
14.కొల్లాపూర్     హర్షవర్ధన్‌రెడ్డి
నల్లగొండ జిల్లా
1.దేవరకొండ    పెండింగ్
2.నాగార్జున సాగర్     కె. జానారెడ్డి
3.మిర్యాలగూడ    పెండింగ్
4.హుజూర్‌నగర్    ఉత్తమ్ కుమార్‌రెడ్డి
5.కోదాడ    ఎన్. పద్మావతి
6.సూర్యాపేట    దామోదర్ రెడ్డి
7.నల్లగొండ    కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
8.మునుగోడు    పెండింగ్
9.భువనగిరి    అనిల్‌రెడ్డి
10.నకిరేకల్    చిరుమర్తి లింగయ్య
11.తుంగతుర్తి    డాక్టర్. రవి
12.ఆలేరు     బిక్షమయ్య గౌడ్
ఖమ్మం జిల్లా
1.పినపాక    రేగా కాంతారావు
2.ఇల్లెందు    పెండింగ్
3.భద్రాచలం     పెండింగ్
4.ఖమ్మం    టీడీపీ
5.పాలేరు    కె. ఉపేందర్‌రెడ్డి
6.మదిర     భట్టి విక్రమార్క
7.వైరా    రాములు నాయక్
8.సత్తుపల్లి    టీడీపీ
9.కొత్తగూడెం     వనమా వెంకటేశ్వర్లు
10.అశ్వరావుపేట    పెండింగ్
హైదరాబాద్ జిల్లా
1.చాంద్రాయణగుట్ట    పెండింగ్
2.యాకుత్‌పురా    పెండింగ్
3.బహుదూర్ పురా    పెండింగ్
4.ముషీరాబాద్    అనిల్ కుమార్ యాదవ్
5.అంబర్‌పేట    పెండింగ్
6.ఖైరతాబాద్     పెండింగ్
7.జూబ్లిహిల్స్    విష్ణువర్ధన్‌రెడ్డి
8.సనత్‌నగర్     మర్రి శశిధర్‌రెడ్డి
9.సికింద్రాబాద్    పెండింగ్
10.నాంపల్లి     ఫారూక్ ఖాన్
11.కార్వాన్    పెండింగ్
12.గోషామహల్     ముఖేష్‌గౌడ్
13.చార్మినార్    పెండింగ్
14.మలక్‌పేట్    టీజేఎస్
15.సికింద్రాబాద్     సర్వే సత్యనారాయణ
కంటోన్మెంట్    
రంగారెడ్డి జిల్లా
1.మేడ్చల్    పెండింగ్
2.మల్కాజిగిరి    పెండింగ్
3.కుత్బుల్లాపూర్    కూన శ్రీశైలం గౌడ్
4.కూకట్‌పల్లి    టీడీపీ
5.ఉప్పల్    టీడీపీ
6.ఎల్.బి. నగర్    సుధీర్‌రెడ్డి
7.మహేశ్వరం    సబితా ఇంద్రారెడ్డి
8.ఇబ్రహీంపట్టణం    పెండింగ్
9.రాజేంద్రనగర్    పెండింగ్
10.శేరిలింగంపల్లి    పెండింగ్
11.చేవెల్ల    పెండింగ్
12.పరిగి    రామ్మోహన్‌రెడ్డి
13.వికారాబాద్    గడ్డం ప్రసాద్
14.తాండూర్    రోహిత్‌రెడ్డి

English Title
Congress finalizes 74 candidates for Assembly Elections




Related News