జగ్గారెడ్డి అరెస్ట్.. సంగారెడ్డి బంద్

Updated By ManamTue, 09/11/2018 - 08:44
Jaggareddy

Jaggareddyహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య, పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి అక్కడే వదిలి వచ్చారన్న ఆరోపణలతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటాన్‌చెరులో ఆయన ఓ కార్యక్రమంలో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.

అయితే పద్నాలుగేళ్ల క్రితం జగ్గారెడ్డి నలుగురికి పాస్‌పోర్టులు తీసుకొని, ఆ పర్యటన అనంతరం ఆయన ఒక్కరే తిరిగి వచ్చారని ఓ వ్యక్తి పోలీసులో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. జగ్గారెడ్డి అమెరికాకు వెళ్లినప్పుడు తన భార్య, పిల్లలతో కాకుండా గుజరాత్‌కు చెందిన యువతి, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి అక్కడే వదిలేశారని గుర్తించారు. మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమైనందుకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు అప్పట్లో జగ్గారెడ్డిగా పీఏగా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వారిద్దరినీ ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

కాగా జగ్గారెడ్డి అరెస్ట్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డిని పోలీసులు సివిల్ డ్రస్‌లో వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఇది ముమ్మటికి కక్ష సాధింపు చర్య అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు జగ్గారెడ్డి అరెస్ట్‌కు నిరసనగా నేడు సంగారెడ్డి బంద్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

English Title
Congress leader Jagga Reddy arrest
Related News