అసెంబ్లీ ఫుటేజీ ఇవ్వండి.. స్పీకర్‌కు జానారెడ్డి లేఖ

Updated By ManamWed, 03/14/2018 - 18:23
Congress Leader Jana Reddy

Congress Leader Jana Reddy Writes Letter To Assembly Speakerహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ‘రగడ’ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసన సభ్యులు సభలో ప్రవర్తించిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కార్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వం రద్దు చేయగా.. మరికొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జిల్లాస్థాయి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జిల్లాల్లో ధర్నాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఇదిలా ఉంటే గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక నేతలు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ తరుణంలో శాసనసభ స్పీకర్‌కు షబ్బీర్ అలీ, జానారెడ్డి లేఖ రాశారు. ఈ నెల 12న అసెంబ్లీలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు అసెంబ్లీలోని అన్ని కెమెరాల వీడియో ఫుటేజీ ఇవ్వాలన్నారు. అయితే ఈ ఫుటేజీ తీసుకున్న అనంతరం కాంగ్రెస్ పెద్దలు ఏం చేయనున్నారు? అధికారపార్టీతో ఎలా ముందుకెళ్లబోతున్నారు? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఢిల్లీలో ఉన్న అధిష్టానం స్పందించకపోవడం గమనార్హం.

English Title
Congress Leader Jana Reddym, Shabbir Ali Writes Letter To Assembly Speaker
Related News