కేసీఆర్‌ నేనెప్పుడు చెప్పాను: జానారెడ్డి

Updated By ManamSat, 09/08/2018 - 13:24
janareddy
  • కేసీఆర్ కు జానారెడ్డి బహిరంగ సవాల్

  • కేసీఆర్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు..

  • నేను అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

kcr-janareddy

హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే  గులాబీ కండువా కప్పుకుంటారన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని... ఆయన ఓసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. 

గులాబీ జెండా పట్టుకుంటానని తానెప్పుడు అనలేదని, కావాలంటే అసెంబ్లీ రికార్డులు పరిశీలించుకోవచ్చని జానారెడ్డి సూచించారు. తాను ఆ మాట అన్నట్లు నిరూపిస్తే తాను 24 గంటల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని అలవాటు కేసీఆర్‌కు ఉందని అన్నారు. కాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజ ఆశీర్వాద సభలో కేసీఆర్ నిన్న జానారెడ్డిపై ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

English Title
congress leader janareddy Open Challenge to trs chief kcr
Related News