నల్గొండలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య

Updated By ManamTue, 02/13/2018 - 08:20
Congress Leader Murder in Nalgonda Dist

congress leader murder in nalgonda distనల్గొండ: జిల్లాలో వరుస హత్యల పరంపర కొనసాగుతోంది. మొన్న కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, నిన్న వివాహేతరం సంబంధం విషయంలో హత్య.. ఇవాళ మరో హత్యతో నల్గొండ అట్టుడుకుతోంది. జిల్లాలోని తిరుమలగిరి మండలం చింతలపాలెంలో ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మానాయక్‌‌‌‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన మంచం కింద నాటుబాంబు పేల్చారు. పేలుడు దాటికి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మృతుడి ధర్మానాయక్‌‌‌‌‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హత్యకు గల కారణం తెలియరాలేదు. ధర్మానాయక్ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, డాగ్‌స్కాడ్ సిబ్బంది, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

English Title
Congress Leader Murder in Nalgonda Dist
Related News