కాంగ్రెస్ శ్రేణుల నిరసన కార్యక్రమాలు

Updated By ManamTue, 03/13/2018 - 17:58
kcr
kcr

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాడిలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ గాయపడ్డారనడం నాటకమని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తమ నాయకులను సభ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. అక్కడక్కడ పోలీసులు దిష్టిబొమ్మల దహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 

kcr

కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాల రద్దు, ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుకు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 

kcr

kcr

 

Tags
English Title
congress leaders protest in Nalgonda dist
Related News