కాంగ్రెస్ నేతల మూకుమ్మడి రాజీనామా!

Updated By ManamTue, 03/13/2018 - 12:01
janareddy speaking at assembly lobby
  • ఇప్పటికే కోమటిరెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వం రద్దుతో రెండు స్థానాలు ఖాళీ

janareddy speaking at assembly lobbyహైదరాబాద్: కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి రాజీనామా చేయాలని, ఏఐసీసీ అనుమతి తీసుకున్న తర్వాత కార్యాచరణను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సస్పెన్షన్ వేటుతో గరంగరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు.. ఎమ్మెల్యేలుగా రాజీనామాలు చేయాలని మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ అనంతరం సీఎల్పీనేత జానారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వం రద్దు చేయడంతో పాటు, విపక్షనేత జానారెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరిపైనా సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. తద్వారా తెలంగాణ శాసనసభ చరిత్రలో తొట్టతొలిసారిగా విపక్షనేతను సస్పెండ్ చేసినట్టయింది. ఈ నేపథ్యంలోనే తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు.. మూకుమ్మడి రాజీనామాలకు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వం రద్దు కావడంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు అందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే మంచిదనే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు సమాచారం. 

English Title
Congress Leaders to Resign Wholely
Related News