పార్టీ టికెట్ కావాలా  బాబూ...?

Updated By ManamMon, 09/03/2018 - 14:46
Tickets only to those with huge social media following in madhyapradesh congress
  • పార్టీ టికెట్ కావాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల్సిందే..

  • ఫేస్‌బుక్‌లో 15,000 లైకులు, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్లు తప్పనిసరి

  • తాజా నిబంధనతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ టికెట్ ఆశావాహులకు షాక్..

  • ‘సైబర్ వారియర్స్’ వర్సెస్ ‘రాజీవ్ కే సిపాయి’

Congress Tickets to go to Leaders Most Active on Social Media in madhya pradesh assembly ticket

భోపాల్ : ప్రస్తుత కాలంలో బిజినెస్‌లోనే కాదూ... పొలిటిక్స్‌లోనూ సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. తమ ప్రొడక్ట్‌ను సోషల్ మీడియాలో ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారో... గత కొంతకాలంగా... రాజకీయ పార్టీలు కూడా తమకు అందుబాటులో ఉన్నంతవరకూ టెక్నాలజీని వాడుకుంటున్నాయి.

దీంతో ఉద్యోగం పొందేందుకు అర్హత ఎలా ఉండాలో రాబోయే ఎన్నికల్లో  పార్టీ టికెట్ ఆశించవారికి తప్పనిసరిగా సోషల్ మీడియాలో కొన్ని  అర్హతలు ఉండాల్సిందేనట... అది కూడా ఫేస్‌బుక్‌లో లైక్స్, ట్విట్టర్‌లో ఫాలోవర్స్, వాట్సాప్‌లో పెద్ద ఎత్తున గ్రూప్స్ ఉంటేనే సుమా.... పార్టీ టికెట్ కన్‌ఫర్మ్ అయ్యేంది. ఈ మేరకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  (ఎంపీసీసీ) పెట్టిన కొత్త రూల్... ఆశావాహులకు ఊహించని ఝలక్‌గా చెప్పుకోవచ్చు.

అంతేకాదు...సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం... పార్టీ నేతలకు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తప్పనిసరిగా అకౌంట్స్ ఉండాల్సిందేనని పేర్కొంది. అలా అని సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే సరిపోదూ... అందుకు తగ్గట్టుగా లైక్స్, ఫాలోవర్స్‌ కూడా ఉండి తీరాల్సిందేనని రూల్స్ పెట్టింది. దీంతో  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న ఆశావాహులకు తాజా కండిషన్‌ ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. 

ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్లు, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని నిబంధనలు విధించింది.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారంతా ఈనెల 15లోగా వారి సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి సమర్పించాలని సూచించింది. పనిలో పనిగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పోస్టులను రీట్వీట్‌ చేయాలని, లైక్‌ కొట్టాలని, పార్టీ అధికారిక పేజీల్లో పోస్టులను తమ పేజీల్లో షేర్‌ చేయాలని పేర్కొంది.

‘సైబర్ వారియర్స్’ వర్సెస్ ‘రాజీవ్ కే సిపాయి’
మరోవైపు రానున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెటిజన్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అధికార బీజేపీ, ప్రతిపక్షం కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ఇప్పటి నుంచే హోరెత్తిస్తున్నాయి.

బీజేపీ ‘సైబర్ వారియర్స్’ అంటూ దూసుకువెళుతుంటే... అందుకు దీటుగా ‘రాజీవ్ కే సిపాయి’ అంటూ కాంగ్రెస్ పోటీ పడుతోంది. డిజిటల్‌ ప్రచారం కోసం  రెండు పార్టీలు ...ప్రత్యేకంగా ఇందుకోసం పెద్ద ఎత్తున సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ యువ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.

English Title
Congress Tickets to go to Leaders Most Active on Social Media in madhya pradesh assembly ticket
Related News