కాంగ్రెస్ గొంతుక గద్దర్!

Updated By ManamSat, 10/20/2018 - 03:50
gaddar

imageచాలాకాలం మావోయిస్టుల ‘మౌత్‌పీస్’గా పనిచేసిన గద్దర్ ఇప్పుడు కాంగ్రెస్ గొంతుకగా మారనున్నారా? అన్న ప్రశ్న కు అవుననే సమాధానమొస్తున్నది. ఇటీవల ఆయన ఏఐసీ సీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఆయన తల్లి సోనియా గాంధీని కలిసి తన ఆలోచనలు పంచుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెసుతో చేరిన అతని కుమారుడు సూర్యకిరణ్, గద్దర్ భార్య విమల కూడా ఉన్నారు. గద్దర్ తన కుమా రునికి టికెట్ ఇప్పించుకునేందుకు ఢిల్లీ పర్యటన చేశారని కూడా వినిపిస్తోంది. తన కుమారుడికి కాంగ్రెస్ టికెట్ లభి స్తే అతని కోసం ప్రచారం చేయడానికి తాను సిద్ధమేనని ఢిల్లీలో ప్రకటించారు. అంటే కాంగ్రెస్ గొంతుకగా మారేం దుకు సిద్ధమయ్యారని అర్థమవుతోంది.

కాంగ్రెస్ నాయకులను కలిశాక పత్రికల వారితో ఆయ న చిత్రవిచిత్రంగా మాట్లాడారు. తెలంగాణలో స్వేచ్ఛలేద ట,image ప్రజాస్వామ్యం ఖూనీ అయిందట, నయాదొరల పాలన సాగుతున్నదట, ఆ నయా భూస్వామ్య పాలనను అంత మొందించడమే తన ధ్యేయమట. అందుకు ఓటు విప్లవం తీసుకొస్తారట. ఇదీ ఆయన వరుస... ఆయన తన జీవితం లో కీలక భాగం, దశాబ్దాల పాటు పార్లమెంటరీ రాజకీయా ల్ని వ్యతిరేకించి, సాయుధ పోరాటం ద్వారానే పేదప్రజలకు విముక్తి లభిస్తుందని పాటలు పద్యాలు పాడి ఇప్పుడు అక స్మాత్తుగా పార్లమెంటరీ రాజకీయం ముద్దుగా, గొప్పగా కని పించసాగాయి. పైగా ఓటు ద్వారా విప్లవం తీసుకొస్తానని నినాదాలు చేస్తున్నారు. ఆశువుగా పాటలు పద్యాలు పాడు తున్నారు. ఇదీ ఆయన వరుస నిలకడలేని తనాన్ని ఆయన ఈ విధంగా రుజువు చేసుకున్నారు.

మతిభ్రమించినట్టుగా తెలంగాణలో రాజ్యాంగం అమ లులో లేకుండా పోయిందని చెప్పడానికి సైతం వెనుకాడ లేదు. ఎంత గుడ్డిగా తన నేలపై ‘ద్వేషం’ పెంచుకున్నారో ఇట్టే అర్థమవుతోంది. తన మరణించిన కుమారుడి సంస్మ రణార్థం ఓ భవనం నిర్మించేందుకు ప్రభుత్వాన్ని స్థలం అడిగినప్పుడు ఆ స్థలం కేటాయించినప్పుడు, తన తుఫ్రాన్ గ్రామంలో మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మతులు చేసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకందుతు న్నప్పుడు గొప్ప ప్రభుత్వంగా కీర్తించిన నోటితోనే ఢిల్లీలో మాత్రం తెలంగాణలో రాజ్యాంగమే లేదని ప్రకటించడం ఆయన డొల్లతనాన్ని తెలియజేస్తోంది తప్ప మరొకటి కాదు.

ఇన్ని అతిశయోక్తులతో ఎవరిని ఆకర్షించాలని ఆయన ప్రయత్నమో ఆయనకే తెలిసినట్టు లేదు. ప్రజలు  ప్రతిపక్ష పార్టీలు కోరితే తాను (గద్దర్) ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తారట. ఇది ఎలాంటి మెలికను, అతి తెలివో ఇట్టే అర్థమవుతోంది. ప్రతిపక్షాలు  ప్రజలకు మరో అభ్యర్థిలేనట్టు, గద్దరే గొప్ప నాయకుడన్నప  ఆయన ఇంటి కెళ్ళి గజ్వేలు నుంచి పోటీ చేయమని ఆహ్వానిస్తారా? అలా ఆహ్వానిస్తే ఈయన వెళ్ళి నామినేషన్ వేస్తాడా, నామినేషన్ వేశాక మీరే నన్ను గెలిపించాలని ప్రజలకు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ తిరిగి ఢిల్లీ ప్రయాణం గట్టి వివిధ కాంగ్రెసు నాయకుల చుట్టూ తిరుగుతూ తెలంగాణలో దొరల పాలన సాగుతోంది. తానొక రాజ్యస్థాపన కోసం నా గళం ధారపో స్తానని ప్రగల్బాలు పలుకుతారా? అది ఆయనకే తెలియా లి?

ఢిల్లీలో పొందూ మతతత్వ శక్తులు రాజ్యమేలుతున్నా యని పనిలో పనిగా ఓ ప్రకటన గుప్పించారు. ఆ శక్తులు రాజ్యంగస్ఫూర్తిని తొక్కి పెడుతున్నాయని ఆరోపించారు. కవులను చంపేస్తున్నావని కూడా ఆయన విమర్శించారు.
కొన్ని పారిభాషిక పదాలను పట్టుకుని పలవరిస్తే, ఆ పలవరింపు పత్రికా ప్రతినిధుల ముందు ప్రదర్శిస్తే అదే అద్భుతమవదు. తాను తెలంగాణలో కొమురెల్లి మల్లన్న దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళి భక్తి ప్రపత్తులను ప్రకటించవచ్చు. ఇతర దేవాలయాలను దర్శించి ప్రజల్లో తాను నాస్తికుడిని కానని నిరూపించుకోవడానికి పడరాని పాట్లు పడవచ్చు. అదే సమయంలో కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారంలో ఉన్నాయని ఆడిపోసుకోవచ్చు. ఆయన ‘కత్తి’కి అన్ని వైపులా పదునే. అదే ఆయన వైనం.

కాంగ్రెసు పార్టీలో చేరనుగాని కాంగ్రెసు పార్టీ నుంచి పోటీచేసే తన కుమారుడి తరపున ప్రచారం చేస్తారట. ఆయన తర్కం ఎంత గొప్పగా ఉందో దీనితోనే తేటతెల్లమ వుతోంది. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిని, మాజీ అధ్యక్షురాలిని కలిసి విధేయతను, వినయాన్ని ప్రదర్శించి తన కుమారు డికి టికెట్ లభించేలా లాబీయింగ్ చేసి తిరిగి తాను స్వతం త్రుడినేనని గొప్పలు పోతారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కీర్తనలు పాడుతూ వేనోళ్ళ పొగిడారు. అంతేగాక తెలంగాణలో భూస్వామ్య పాలనను కాంగ్రెసు పార్టీ మాత్రమే అంతమొందించగలదని చెబుతున్నారు.
వాస్తవానికి కాంగ్రెసు పార్టీలో తొలినుంచి ఉన్నది భూ స్వాములే మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెసు వా ళ్ళను ఎంత కించపరిచి మాట్లాడాడో, ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. ఇప్పటికీ ఆ వారసత్వమే ఆ పార్టీ లో కొనసాగుతుండగా ఇప్పుడు ఆ సంగతులేవీ కనిపించక పోవడం ఆయన దృష్టిలోపం తప్ప మరొకటి కాదు. ఇప్పు డు ఆ కాంగ్రెసు పార్టీ పూర్తిగా లౌకికపార్టీగా దర్శనమిస్తోంది ఆయనకు. పరిశుద్ధమైన పార్టీగా గోచరమవుతోంది. ఇంత కన్నా వింత ఇంకేమి ఉంటుంది?

విచిత్రమేమిటంటే ప్రజలకు  లౌకిక శక్తులకు మధ్య తాను వారధిగా ఉంటానని కూడా ఆయన వాగ్దానం చేశా రు. రాబోయే ఎన్నికలు మతతత్వ శక్తులకు లౌకిక శక్తులకు మధ్య జరుగుతాయని భవిష్యవాణిని వినిపించారు. ఇలా తన నోటికి ఏది వస్తే అది పలకడమే పనిగా పెట్టుకుని ఓ ప్రదర్శకుడిగా తన కొత్త అవతారం ఎత్తారు.
తెలంగాణలో ఎన్నికలో మతతత్వ శక్తులు లౌకిక శక్తుల మధ్య జరగడం లేదని రాజకీయం తెలియని వ్యక్తి అయినా చెబుతాడు. మరి ఆయన నినాదానికి ఏమిటి అర్థం? ఇక జాతీయ స్థాయిలో ఆ రకంగా ఎన్నికలు జరిగితే గద్దర్ ప్రభావం ఎక్కడ ఆన్తది! అసలు ఉత్తర భారతంలో ఆయన గూర్చి ఎవరు పట్టించుకుంటారు! అలాంటప్పుడు ‘వారథి’ అనే మాట ఎలా ఉత్పన్నమవుతుంది. అంతా డొల్లదనం తప్ప మరేమీ కనిపించడం లేదు. తన ‘ఉనికి’ని ఎలా కాపాడుకోవాలన్న తీవ్ర మానసిక సంక్షోభంలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్‌లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సభలో మాట్లాడినప్పటిసరళికి, కాంగ్రెసు అధ్యక్షు డు, యూపీఏ చైర్‌పర్సన్ ముందు మాట్లాడిన సరళికి ఎంత తేడా ఉందో ఇట్టే తెలుస్తోంది. 

కరడు గట్టిన రాజకీయ నాయకుల పుత్రవాత్సల్యం గూర్చిన విషయాలు గతంలో ఎన్నో వెలుగుచూశాయి. కేవలం ప్రజల కోసం పుట్టి, ప్రజల కోసం పాట కట్టి, ప్రజల కోసమే జీవిస్తున్నానని చెప్పుకునే గద్దర్‌కు ఇంత ‘పుత్రవాత్సల్యం’ తగునా? హైదరాబాద్‌లో భట్టి విక్రమా ర్క్‌ను కలిసి తన కొడుక్కి టికెట్ గూర్చి చర్చ చేస్తారు. అక్కడ పని జరగదని తెలిసి ఏకంగా ఢిల్లీకెళ్లి అక్కడ కాంగ్రెస్ అధినాయకత్వం ముందు తన కుమారుడు, భార్యతో కలిసి ప్రత్యక్షమై సానుభూతి పొందేలా పాటలు పాడి, మాటలు మాట్లాడి కొడుక్కి టికెట్ ఇప్పించుకు నేందుకు ఇన్ని పాట్లు పడే గద్దర్ ఎలా ప్రజల కోసమే జీవిస్తున్న గాయకుడు అవుతారు?

అందరు రాజకీయ నాయకులు చేసిన, చేస్తున్న పనులే బహిరంగంగా గద్దర్ చేస్తుండగా ఆయన ప్రత్యేకత ఏమిటి? మాటల గారడీతో ఆకట్టుకుని తానొక తామరాకుపై నీటి బొట్టునన్న ‘కీర్తి’ని కొట్టేసే ప్రయత్నించడం, ఆ భ్రమను కలిగించడంలో అరిదే రాడు.

మావోయిస్టుల మౌత్ పీస్‌గా ఉన్నప్పుడు ఎందరో యువకులు అమరులయ్యేందుకు కారణమైన గద్దర్ ఇప్పు డు తన కుమారుడి ఉజ్వల భవిష్యత్ కోసం రాజకీయ భవిష్యత్ కోసం ఇంతగా దిగజారి వ్యవహరించాలా? తన కుమారుడిలో ఆ ‘స్పార్క్’, మెరుపు ఉంటే మెరుస్తాడు. స్వయం ప్రకాశకులకే రాజకీయాల్లో స్థానం తప్ప మరొకరికి ఉండదని గద్దర్‌కు తెలియనిది కాదు. 

- వుప్పల నరసింహం
సీనియర్ జర్నలిస్టు
9985781799

English Title
Congress Voice Gaddar!




Related News