పొత్తు పొడుస్తున్నది

Updated By ManamMon, 09/10/2018 - 23:54
Uttam kumar reddy
  • టీడీపీతో చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్

  • రేపో, ఎల్లుండో ఇతర పక్షాలతో భేటీలు

  • 18 వరకు జరిగే జెండా పండుగను విజయవంతం చేయాలి: ఉత్తమ్

uttamహైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేసేం దుకు తెలుగుదేశం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఈ దిశగా చర్చల ప్రక్రియను కాంగ్రెస్  ప్రారంభించింది. త్వరలోనే తెలుగు దేశం, తెలంగాణ జనసమితి, సీపీఐతో చర్చలు ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు. కేసీఆర్ దుష్టపాలనను అంతం చేసేందుకు అందరూ కలిసి రావాలని ఉత్తమ్ మరోసారి విజ్ఞప్తి చేశా రు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి, యువజన, మహిళా సంఘాలు, ఇతర సంస్థలు కలిసి రావాలన్నారు. పొత్తుల విసయంలో కాంగ్రెస్‌లో స్పష్టత వచ్చిం దని, టీడీపీకి, సీపీఐకి ఏ స్థానాలు కేటాయించాలన్న దానిపై ఒక అవగహనకు వచ్చిన తరువాతే పొత్తులపై చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. టీడీపీకి 15 సీట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీపీఐకి, కోదండరాం పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. చర్చల సందర్భంగా ఆయా పార్టీలు ఇచ్చే జాబితా ఆధారంగా ఎన్నిసీట్లు, ఎక్కడ ఇవ్వాలన్నదానిపై చర్చించనున్నారు. పొత్తల విషయాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చి, వెంటనే ప్రచారం ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అజాద్ పర్యటన తరువాత కాంగ్రెస్‌లోనూ వివిధ కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రచారం ప్రారంభించాలని ఉత్తమ్ భావిస్తున్నారు. సభ ఎక్కడ పెట్టాలి, తేదీ వంటి అంశాలు నిర్ణయించిన తరువాత సభకు సోనియా, రాహుల్ గాంధీలను రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు . ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ముఖ్యంగా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు, వాటిని విస్మరించిన తీరుపైనే ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు, కేసీఆర్ తీరును బహిరంగ సభలో గట్టిగా ఎండకట్టడం ద్వారా ఎదురుదాడికి కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. 

11 నుంచి 18 వరకు జెండా పండుగ: ఉత్తమ్ 
11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలని, సమావేశాలు , సభలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ వాదుల ఇండ్లపై , వాహనాలపై జెండాలు ఎగుర వేయాలని కోరారు. పార్టీ యంత్రాంగాన్ని గ్రామ స్థాయి వరకు సన్నద్దం చేసేందుకు జెండా పండుగను భారీ స్థాయిలో నిర్వహించాలని పార్టీ నాయకులను పీసీసీ కోరింది. అన్ని గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలు, నాయకులు ఓటర్ల జాబితాను పరిశీలించి ,  అర్హులైన వారితో దరఖాస్తులు పెట్టేలా చూడాలని ఉత్తమ్ కోరారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ముందస్తు ఎన్నికల్లో గెలవబోతున్నాం: జానారెడ్డి
ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ ,డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామన్నారు. బంద్‌ను విజయవంతం చేసిన కార్యకర్తలు,నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్ పన్నులు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.

English Title
Congress, which started talks with TDP
Related News