కేటీఆర్‌‌తో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్‌ భేటీ

Updated By ManamMon, 04/16/2018 - 14:00
KTR, Consulate General of Australia, Ms Susan Grace

KTR, Consulate General of Australia, Ms Susan Grace హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సోమవారం క్యాంప్ ఆఫీస్‌లో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సుసాన్ గ్రేస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. మౌలిక వసతులు, క్రీడలు, ఐటీ రంగాల్లో ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరించారు. మహిళా వ్యాపారవేత్తల కోసం వి-హబ్ ఏర్పాటు చేసినందుకు కేటీఆర్‌ను సుసాన్ గ్రేస్ అభినందించారు. కాగా, ఈ భేటీలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అరవింద్ కుమార్, జయేష్ రంజన్, ట్రేడ్ కమిషనర్ మునీష్ శర్మ పాల్గొన్నారు.

English Title
Consulate General of Australia meets KTR
Related News