ఇదే జోరు కొనసాగాలి

Updated By ManamWed, 03/21/2018 - 01:31
team-india

team-indiaకొలంబోలో ముగిసిన నిదహాస్ కప్ టీ-20 టోర్నీ భారత జట్టుకు ఎన్నో పాఠాలు నేర్పింది. కొత్త కుర్రాళ్లతో సెలెక్టర్లు చేసిన ప్రయోగాలు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. 2019 ప్రపంచ కప్ కోసం సెలెక్టర్లు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్‌ను రెడీ చేస్తుంటే.. మేము సైతం రేస్‌లో ఉన్నామంటూ యువ ఆటగాళ్లు చాలా మంది ఈ టోర్నీతో తెరపైకి వచ్చారు
  ఒక్క సిక్స్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన దినేశ్ కార్తీక్.. ఆఫ్ స్పిన్‌తో అదరగొట్టిన సుందర్‌లతో పాటు పలువురు యువ ఆటగాళ్లు  శ్రీలంకలో ముగిసిన నిదహాస్ కప్ టి20 టోర్నీలో బ్రహ్మాండంగా  రాణించారు.  జట్టులో దాదాపు సుస్థిర స్థానం సంపాదించారు. వాస్తవానికి ఈ  టోర్నమెంట్‌కు ముందు భారత సెలెక్టర్లు జట్టు ఎంపికకోసం సుదీర్ఘ కసరత్తే చేశారు. 2019 ప్రపంచ కప్ లక్ష్యంగా ఇప్పటి నుంచే భారత ఆటగాళ్లను  సిద్ధం చేయటం కోసం ఈ సెలెక్షన్ సాగింది. పొట్టి ఫార్మాట్ అయినప్పటికీ  యువ ఆటగాళ్లతో సెలెక్టర్లు పెద్ద ప్రయో గమే చేశారు. ఒకరిద్దరు మినహా మిగతా ఆటగాళ్లంతా ఈ టోర్నమెంట్ ద్వారా ఫామ్‌లోకొచ్చారు.  ఏప్రిల్-మే నెలల్లో జరిగే  ఐపీఎల్  ఎలా ఉన్నా...ఆ తర్వాత భారత జట్టు  ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనలో ఆడుతుంది. ఇంగ్లండ్ టూర్ అనంతరం భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఆడుతుంది. ఈ మూడు సిరీస్‌లు భారత్‌కు క్లిష్టమైనవే. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఓడినప్పటికీ వన్డే సిరీస్, టి20ల్లో భారత్ దుమ్మురేపింది. చరిత్ర తిరగరాస్తూ సిరీస్ గెలుచుకుని సగర్వంగా స్వదేశానికి చేరుకుంది. ఇప్పుడు భారత్ ఫోకస్ అంతా భవిష్యత్‌లో ఆడబోయే సిరీస్‌లపైనే. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న జట్టుతో పాటు  మరికొంత మందికి ఎలాగూ అవకాశం ఉంటుంది కనుక శ్రీలంక సిరీస్‌ను వేదికగా ఎంచుకుని పరీక్ష పెట్టింది.  

ధోనీ స్థానానికి కార్తీక్ ఎసరు...
ఇప్పటికే  టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోనీకి ప్రత్యామ్నాయంగా దినేశ్ కార్తీక్ సిద్ధంగా ఉన్నాడు. ఓటమి అంచుల్లో ఉన్న భారత జట్టును ఒక్క సిక్స్ కొట్టి గెలిపించి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర చుకున్నాడు.  ఈ టోర్నీ తర్వాత కార్తీక్‌పై సరికొత్త చర్చ మొదలైంది. ఇంతకాలం ధోనీ ఉండటం వల్ల కార్తీక్‌కు జట్టులో అవకాశం రాలేదు.. మరి ధోనీ జట్టులో లేనప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయగలడనే చర్చ మొదలైంది. విశ్లేషకులంతా కార్తీక్‌కు మద్దతుగా నిలిచారు. వికెట్ కీపర్‌గా కార్తీక్‌కు ఛాన్స్ ఇవ్వాలని విశ్లేషకులు, అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు.  భారత జట్టుకు బెస్ట్ ఫినిషర్‌గా  నిలిచిన ధోని కొంత కాలం నుంచి పరుగుల వేటలో వెనకబడ్డాడు. దూకుడు తగ్గిన ధోనీ ప్లేస్‌ను కార్తీక్‌భర్తీ చేయగలడని మాజీలు అంటు న్నారు.  అంత ఒత్తిడిలోనూ కార్తీక్ ప్రశాంతంగా ఆడగలగడం గొప్ప విషయం,  మంచి బ్యాట్స్ మెన్‌గా మాత్రమే కార్తీక్ తెలుసు, ఇప్పుడు ఓ గొప్ప ఫిని షర్ కూడా     అనిపించుకున్నాడు అని మాజీ     స్టార్ శ్రీకాంత్ అన్నాడు.  ఇంత     మంది అభిప్రాయాల్ని సెలెక్టర్లు గౌరవిస్తారా లేక మళ్లీ కార్తీక్‌తో ప్రయోగాలు చేస్తారో     తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

సవాళ్లకు సిద్ధం: సుందర్
న్యూఢిల్లీ : కొత్త కుర్రాళ్లతో శ్రీలంకలో ముగిసిన నిదహాస్ కప్ టి20 ట్రైసిరీస్‌లో భారత క్రికెట్ బోర్డు చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఈ సిరీస్ ద్వారా జట్టులో సుస్థిర స్థానం పొందే అవకాశాలను చాలా మంది యువ ఆటగాళ్లు మెరుగు పరచుకున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు యంగ్ ఆఫ్ స్పిన్నర్ సుందర్ కూడా చేరాడు. కేవలం 5.70 ఎకానమీతో  ఐదు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన సుందర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకుని సత్తా ఏమిటో చూపెట్టాడు.  భారత వన్డే, టి20 జట్లలో ఏడాది కాలంగా మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ హవా కొనసాగుతోంది.  దీంతో సీనియర్ స్పినర్లు అశ్విన్, జడేజాలు కూడా టెస్టులకే పరిమితమై పోయారు. అయితే కొలంబో వేదికగా జరిగిన టి20 ట్రై సిరీస్‌లో సుందర్ స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కుల్దీప్ యాదవ్  గాయపడటంతో ఆ స్థానంలో జట్టులోకొచ్చిన సుందర్ సెలక్టర్ల నిర్ణయం సరైందేనని ప్రూవ్ చేశాడు.  ఈ  టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కుతుందని తాను ఊహించలేదంటున్న సుందర్ అన్నింటికీ సిద్ధమై ఉన్నానని, ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొనేం దుకు రెడీ అయి  ఈటోర్నీలో ఆడానని చెప్పాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో తన ఆఫ్ స్పిన్ పవరేమిటో చూపెట్టి టోర్నమెంట్ మొత్తం మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న సుందర్ ఇక భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించినట్టే అనుకుంటున్నాడు.

కార్తాక్‌కు ప్రేమతో..
చెన్నయ్ : టి20 ట్రై సిరీస్ టోర్నీలో చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించిన స్టార్  దినేశ్ కార్తీక్ ప్రతిభ పట్ల ఆయన భార్య దీపిక పల్లికల్ ఆనందం వ్యక్తం చేశారు.  ఒకప్పటి భారత స్క్వాష్ క్రీడాకారిణి అయిన దీపిక  మ్యాచ్ అనంతరం  టీవీలో కనిపిస్తున్న దినేశ్ కార్తీక్ ఫోటోపై  మై దాదా మై సూపర్ హీరో అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. మరో పోస్ట్‌లో కార్తీక్ ఫోటోపై లవ్ సింబల్ పెట్టి తన ప్రేమ చాటుకున్నారు. మొదటి భార్య నికిత నుంచి విడాకులు తీసుకున్నాక  2015లో దీపికా పల్లికల్‌ను దినేశ్ కార్తీక్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Tags
English Title
This is a continuation
Related News