చైనా ఒత్తిడికి సుష్మా సాగిలపడ్డారు

Updated By ManamFri, 08/03/2018 - 00:05
rahul gandhi
  • వివాదాస్పద ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ  

న్యూఢిల్లీ:  విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. డోక్లాం వివాదం లో చైనా ఒత్తిడికి సుష్మ సాగిలపడ్డార ని రాహుల్ ట్వీట్ చేశారు. దౌత్యప రమైన పరిణితిని ప్రదర్శించి ఒక్క అంగుళం భూమిని కూడా పోగొట్టుకోకుండా డోక్లాం ప్రతిష్ఠంభన తొల గించినట్టు లోక్‌సభలో బుధవారం సుష్మ ప్రకటన చేశాక రాహుల్ ఈ తీవ్ర ఆరోపణలు చేయడం విశేషం.
 

image


  ‘‘చైనా అధికారానికి సుష్మాజీ వంటి వ్యక్తి ఎలా తలొగ్గారో అర్థంకావడం లేదు, మంత్రి వ్యాఖ్యలు సరిహద్దుల్లోని భారత సైనికులను మోసంచేసేలా ఉన్నాయి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా చైనా, భూటాన్ మధ్య భూవివాదాలు కొనసాగుతుండగా, డోక్లాంలో మాత్రం యథాతథ పరిస్థితి నెలకొందని సుష్మా లోక్‌సభలో స్పష్టంచేశారు. భారత్, చైనా, భూటాన్ దేశాల ట్రైజంక్షన్‌లోని డోక్లామ్‌లోకి చైనా బలగాలు ప్రవేశించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో మన సైన్యం అడ్డుకుంది.

English Title
The controversial Tweeted Rahul Gandhi
Related News