చల్లని వేసవి

Updated By ManamTue, 03/13/2018 - 02:12
anushka

ఉదయం ఏడుగంటలు కూడా కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే..అమ్మో మార్చ్ నెల్లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో ఎలారా దేవుడా అని ఆలోచిస్తున్నారా?  తప్పదు మనం అన్ని సీజన్లనూ ఆస్వాదించడం నేర్చుకునే వరకూ ఇలాంటి ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.  ఏ సీజన్‌లో ఎలా ఉండాలో, ఏం తినాలో, ఏం చేయాలో అవి మాత్రమే చేస్తూ పోయామనుకొండి అప్పుడు ఆయా సీజన్ల కష్టాలు తట్టుకోవడం ఈజీ అవుతుంది. అందుకే మీరు వడగాలుల గురించి దిగులు పడి ప్రయోజనం లేదని గుర్తించి, కాస్త జాగ్రత్తగా ఈ సమ్మర్‌ను గడిపితే సరిపోతుంది. ఇందుకు ఏం చేయాలి అంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కాసింత అవగాహనతో మెలిగితే  ఈ ఎండా కాలం కూల్‌గా గడిచిపోతుంది. 

image

దినచర్యను త్వరగా మొదలుపెట్టడం
సమ్మర్‌లో త్వరగా నిద్రలేవడం చాలా ముఖ్యమైన అంశంగా ప్రాధాన్యతనిచ్చేలా చూసుకొండి. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి, చకచకా మీ పనులన్నీ చేసేసుకుంటే పొద్దు పెరిగే సమయానికల్లా నీడపట్టున హాయిగా విశ్రాంతి తీసుకోవడం, ఎండ తగ్గాక మళ్లీ imageరొటీన్ పనులు పూర్తయ్యేలా చూసుకుంటే మీరు ఎక్కువగా అలసిపోకుండా, ఎండ వడనుంచి కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా పొద్దెక్కాక లేచి.. అప్పుడు వేడి గాలులు తట్టుకోలేక నానా తిప్పలు పడి ఉసూరుమనకుండా ఉండేలా ప్లాన్ చేసుకొండి. ఇందుకు రాత్రిళ్లు కూడా త్వరగా ఇంటికి చేరుకుని ఎర్లీగా డిన్నర్ చేసి, విశ్రమిస్తే మీ శరీరం వేసవి అలసటనుంచి త్వరగా బయటపడి, సేద తీరుతుంది.


 

 

ఎండలో వెళ్తున్నారా?
ఆఫీస్,కాలేజ్ లే దా ఇతరత్రా పనులపై బయటికి వెళ్లేవారు మంచి కాళ్ల జోడు, కళ్ల జోడు ధరించడం అత్యవసరం, దీనికి తోడుimage గొడుగును తీసుకెళ్లడం ఈ రెండున్నర నెలలు మరవద్దు, ఉన్నట్టుండి క్యూములో నింబస్ మేఘాలు వర్షించడంతో తడిసిపోతే కూడా జ్వరం రావచ్చు, మధ్యహ్నం ఎండ తీవ్రతనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే సన్‌స్క్రీన్ వంటివాటికంటే మెరుగైన సాధనం గొడుగే. టూవీలర్‌లో వెళ్లేవారు హెల్మెట్, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి. దీంతో ట్యానింగ్‌కు కూడా తక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక మీ చర్మంలో తేమ సురక్షితంగా ఉంటుంది. వీలైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే ఆశ్రయిస్తే హాయిగా గమ్యస్థానం చేరుకోవచ్చు. టూ వీలర్ కంటే బస్సు లేదా రైలు ప్రయాణం చేయడం ఉత్తమం. చర్మంపై ప్రత్యక్షంగా ఎండ పడి (అల్ట్రా వైలెట్ రేస్) అతినీలలోహిత కిరణాలతో సన్ బర్న్ వంటివి రాకూడదంటే సన్ స్క్రీన్ రాసేసుకుంటే సరిపోదు.. చేతులు, మెడ, ముఖం,తలపై ఎండ పడకుండా కేర్ తీసుకోవాలి. వైద్యులు చెప్పే ఈ సూచనలు తూ.చ. తప్పకుండా పాటించారో సమ్మర్ ఇట్టే హాయిగా గడిచిపోతుంది. 

సీజనల్ పళ్లు, కూరగాయలు
imageఎండకాలం వచ్చే పుచ్చకాయలు మొదలు ఖర్బూజా, మామిడి , వంకాయ, మునక్కాయ, కొబ్బరి కాయలు, చింత చిగురు, తాటి ముంజలు వంటి సీజనల్ పళ్లు, కూరగాయలన్నీ తప్పకుండా సేవించండి. దీంతో మీకు ఇమ్యూనిటీ పెరిగి, సమ్మర్‌ను కూల్‌గా డీల్ చేసే తత్వం మీ శరీరానికి అలవడేలా చేస్తుంది. ఇక నిల్వ ఉన్న ఆహారం తినకుండా అప్పటికప్పుడు వండుకుని తినడంతో ఎండా కాలంలో వంటలు త్వరగా చెడిపోతాయన్న బెడద ఉండదు. భోజనంలో పెరుగు లేదా మజ్జిగతోపాటు మజ్జిగ పులుసు, పచ్చి పులుసు వంటివి ఉండేలా మెనూ రెడీ చేసుకోండి. ఆమ్ రస్ లేదా మామిడి పళ్లు కూడా ఎండకాలంలో తినడంతో నీరసాన్ని అధిగమించే ఛాన్స్ ఉంటుంది. 

చిన్నారులు జాగ్రత్త
చెమటను తట్టుకోలేక చిన్నారులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే చిన్నారులతోపాటు ఇంటిల్లిపాది అందరూimage వదులుగా ఉన్న వస్త్రాలే ధరించండి, స్కిన్ టైట్‌తో స్కిన్ అలర్జీలు తప్పవు, పైపెచ్చు ముతక వస్త్రాలైన కాటన్ వంటివి వేసుకోవడంతో మీరు బయటికి వెళ్లినా చర్మం కమిలిపోకుండా, అతిగా శరీర దుర్గంధం రాకుండా ఉంటుంది. మీ పిల్లలకు స్విమ్మింగ్ వంటివి నేర్పేందుకు సమ్మర్‌లో టైం కేటాయించండి, దీంతో వారు బాగా సమ్మర్‌ను ఎంజాయ్ చేయడమేకాదు, శారీరకంగా కూడా ఎదిగే అవకాశాన్ని స్విమ్మింగ్ కల్పిస్తుంది. చిన్నారులను రెండు లేదా మూడు పూటలా స్నానం చేయించండి, వీరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కనుక దద్దర్లు వంటివి రాకుండా ఉండేలా ఇది తోడ్పడుతుంది. చెమటకాయలు వంటివి పారద్రోలాలంటే కూడా స్నానం మంచి ఆయుధంలా పనిచేస్తుంది. పళ్ల రసాలు, నీరు గంటకోమారు తాగిస్తూ పిల్లల్లో డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలకు ఖర్జూరం, బాదం, పిస్తా, చెర్రీస్, జీడిపప్పు, కిస్‌మిస్ వంటి డ్రైఫ్రూట్స్, నట్స్‌ను కూడా ఎక్కువగా ఇవ్వండి, ఇది శారీరక బలాన్ని పెంచుతుంది. అన్ని వయసుల వారు రొటీన్‌లో భాగంగా వేసవిలో వీటిని తినడంతో నీరసం దరిచేరకుండా ఉంటుంది. 

ఈ-కొలీతో పారాహుషార్
సమ్మర్ రాగానే ఈ-కొలి imageబ్యాక్టీరియా వీరవిహారం చేసే సీజన్ కనుక బయట ఆహార పదార్థాలు తినాల్సివస్తే వేడిగా మాత్రమే తినండి. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లపై అమ్మే పానీ పూరీ, చాట్, సోడాలు, తినుబండారాల్లో ఇది విపరీతంగా పెరుగుతుంది కనుక ఇలాంటి చోట్ల తినే సమయంలో ముందూ వెనుకా చూసి తినడం అతిముఖ్యమైన అంశం. వీలైతే ఈ వేసవిలో బయటి ఆహారానికి గుడ్‌బై చెప్పండి. ముఖ్యంగా హోటళ్లలో తినే నాన్‌వెజ్‌తో మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి, అందుకే వేసవిలో బయట నాన్‌వెజ్ తినేముందు హైజీనిటీపై ఓ కన్నేయండి. తినే ఆహారం కూడా మిగతా రోజుల్లోలా ఎక్కువగా లాగించేయకుండా మితంగానే తినండి. ఎక్కువ నీరు తాగుతూ, తక్కువ ఘన పదార్థాలు తినడంతోపాటు ఈజీగా జీర్ణమయ్యే పదార్థాలను ఎంచుకోండి. మసాలాలు, కారం, నూనె ఎక్కువగా ఉన్నవాటికి ఈ రెండున్నర నెలలు కాస్త దూరంగా ఉండేలా నోటి చపలత్వానికి తాళం వేయండి. తాజా పళ్లు, కూరగాయలతోపాటు డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎక్కువగా తింటూ, కీరా దోసకాయ వంటి నీరు అధికంగా ఉన్న కూరగాయలకే ప్రాధాన్యతనిస్తే మీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. 

నీరు, నీరు, నీరు
బయటినుంచి రాగానే చల్లటి నీటితో ముఖం కడగండి, లేదా స్నానం imageచేయండి. మిగతా రోజుల్లో కంటే రెండు లీటర్ల నీరు సమ్మర్‌లో రోజూ ఎక్కువ తాగండి. కుండలో నీళ్లు తాగితే దాహం తీరుతుంది, అదే ఫ్రిజ్ నీరు అయితే ఎంత తాగినా దాహం తీరకపోగా, గొంతు నొప్పికి దారితీసే ప్రమాదముంది. ఇక వేసవి పోయేవరకూ రెండు పూటలా స్నానం చేస్తే అదే మీ చర్మానికి శ్రీరామరక్షలా పనిచేస్తుంది. ఇక ఇంటినుంచి కాలు బయట పెట్టారో నీళ్ల బాటిల్ లేకుండా మాత్రం కదలకండి.  మిట్టమధ్యహ్నం బయటినుంచి ఇంట్లోకి రాగానే కాసిన్ని నీళ్లు అందులోకి ఉప్పు, చక్కెర చిటికెడు కలిపి తాగితే మీకు కళ్లు తిరగకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లు, నీళ్ల మజ్జిగ వంటివి ఇంట్లో నిలువ ఉండేలా చూసుకొండి. ఇక నిమ్మకాయ రసంలోకి కాసింత చక్కెర, ఉప్పు వేసుకుని సేవిస్తే అది దివ్యౌషధంలా ఈ వేసవిలో మీకు సహకరిస్తుంది. చెమట ఎక్కువగా వచ్చే శరీర తత్వం ఉన్నవారు రోజూ ఇలాంటి పానీయాలు సేవిస్తే అలసటనుంచి ఈజీగా బయటపడవచ్చు. 
- శ్రావణ్ కుమార్, హైదరాబాద్

English Title
cool summer
Related News