కార్నివాల్ టైమ్

Updated By ManamFri, 02/09/2018 - 00:30
cornival

cornivalవీకెండ్ వస్తోంది ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారా? అయితే మీలాంటి ట్రావెల్ ఫ్రీక్స్‌కు సూపర్ ఐడియా!
గోవా చుట్టి రండి. ఎందుకంటే గోవాలో బీచుల అందాలే కాదు, ఇప్పుడు మీరు గోవా వెళ్తే, గోవన్ సంప్రదాయాలను కళ్లారా చూసే ఛాన్స్ దొరుకుతుంది.  ఎందుకంటే ఇది ‘గోవన్ కార్నివాల్’ సమయం మరి. 

 

వీధుల్లో పెరేడ్ సందడి

కార్నివాల్ అంటేనే వీధుల్లో చేసే సందడి కావడంతో, లైట్స్, మ్యూజిక్, డ్యాన్స్‌తో గోవా వీధులన్నీ మారుమోగనున్నాయి. పోర్చుగీస్ cornivalకల్చర్, ఇండియన్ కల్చర్ కలబోసిన ఫ్యూజన్ కల్చర్‌తో సాగే కార్నివాల్ ర్యాలీలు వావ్ అనిపిస్తాయి.  ఫన్నీ కాస్ట్యూమ్స్, చిత్ర విచిత్రమైన మాస్కులు, ఫీట్లు చేసే ఎంటర్‌టైనర్స్ ఈ పెరేడ్స్‌లో హైలైట్‌గా నిలుస్తాయి. ఇక ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకునే వారికైతే లెక్కలేనన్ని సందర్భాలు లెన్స్‌కు చిక్కేలా చూడచక్కగా ఉంటాయి. ఒక్కమారు మీరు ఈ కార్నివాల్ వెళితే, జీవితకాలానికి సరిపడా ఆనందాన్ని వెంటతెచ్చుకోవచ్చు. మనదేశంలో కార్నివా ల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న గోవాలో, ఒక్కమా రైనా కార్నివాల్ సెలబ్రేషన్ చూసితీరాల్సిందే. 

బ్రెజిల్ వెళ్లలేకపోతే..

జనరల్‌గా కార్నివాల్ అంటే అందరికీ ఠకీమని గుర్తుకు వచ్చేది బ్రెజిల్. కానీ బ్రెజిల్ వెళ్లలేని వారు మనదేశంలోనే జరిగే గోవన్ కార్నివాల్ చూస్తే సరిపోతుంది.  బ్రెజిల్ స్థాయిలో లేకపోయినా అదే స్టైల్‌లో ఉండే ఈ కార్నివాల్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది.  చిన్నా, పెద్దా అందరినీ అట్రాక్ట్ చేసే ఈ కార్నివాల్ గెటప్స్, ఫుడ్, వాహనాలు భలే ఆసక్తిగొలుపుతాయి.

శనివారం స్టార్ట్

గోవన్ టూరిజంలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఈ కార్నివాల్ శనివారం ప్రారంభమవుతుంది.  ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరిగే ఈ cornivalఫెస్టివల్‌కు దేశ విదేశాలనుంచి పర్యాటకులు తరలివస్తారు.  ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 13 వరకూ జరిగే కార్నివాల్‌కు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. లోకల్స్, ట్రావెలర్స్‌ను సంతోషపరిచేలా నాలుగు రోజుల కార్నివాల్ గోవాలోని వివిధ బీచుల్లో ఒక్కో రోజు ఒక్కో వేదికగా సాగుతాయి.

 

వసంత ఆగమనంతోనే..

గోవన్ కార్నివాల్ ఈనాటిది కాదు. పోర్చుగీస్ వారు గోవాను పరిపాలించే కాలంలో మొదలైన ఈ సంప్రదాయంలో భాగంగా, 18వ శతాబ్దం నుంచి ఇక్కడ ఏటా కార్నివాల్ నిర్వహిస్తున్నారు. వసంతరుతువు ఆగమనాన్ని పురస్కరించుకుని, ప్రకృతిని ఆరాధిస్తూ, సరికొత్త చిగుర్లను ఆస్వాదిస్తూ, ప్రకృతిలో మమేకమై సాగడమే ఈ కార్నివాల్ ఆంతర్యం. ఈస్టర్‌కు ముందు 40 రోజుల పాటు లెంట్‌ను ఆచరించే ముందు సాగే కార్నివాల్, గోవా రాజధాని పంజిమ్‌లో కింగ్ మోమో రాకతో స్టార్ట్ అవుతుంది. మపుసా, వాస్కో, పంజిమ్ బీచుల్లో సకల హంగులతో సాగే కార్నివాల్‌ను మీరు చూసిరండి,మరెందుకు ఆలస్యం?

English Title
cornival time
Related News