మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Updated By ManamThu, 06/21/2018 - 09:52
mallya

Mallya  ముంబై: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసి ఛార్జిషీట్ నేపథ్యంలో ముంబై ప్రత్యేక కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి కేసు విచారణను జూలై 30వ తేదికి వాయిదా వేసింది. 

అయితే మనీ లాండలింగ్ చట్టం కింద రూ.6వేల కోట్ల మేర బ్యాంకుల కన్సార్షియంను మాల్యా మోసగించారంటూ ఈడీ తాజాగా ఓ ఛార్జిషీటును దాఖలు చేసింది. 2005-10 మధ్య కాలంలో రుణ వాయిదాల చెల్లింపులు జరపకపోవడం వల్ల రూ.6,027కోట్ల మేర నష్టపోయిన కేసును సంబంధించిన ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.

English Title
Court orders arrest of Mallya
Related News