వివాహేతర సంబంధమే కారణం

Updated By ManamTue, 02/13/2018 - 12:41
Botanical

Botanicalహైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన బొటానికల్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. మృతురాలు పింకీ అలియాస్ శాలిని స్వస్థలం బీహార్‌లోని కుగ్రామం కాగా.. ఆమెకు దినేష్ అనే వ్యక్తితో 15ఏళ్ల క్రితం పెళ్లయిందని.. కొన్ని కారణాల వలన 2017లో భర్తను విడిచిపెట్టిందని పోలీసులు తెలిపారు.

ఆ తరువాత పింకి, వికాస్ అనే వ్యక్తితో సహజీవనం ప్రారంభించిందని వారు పేర్కొన్నారు. అయితే అప్పటికే మమత అనే మరో మహిళ వికాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. ఆమె తన కుటుంబంతో సహా అతడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఈ క్రమంలో వికాస్‌ను వెతుక్కుంటూ పింకి కూడా హైదరాబాద్‌కు వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మమత కోపంతో తన కుమారుడు అమర్‌నాథ్ తదితరుల సాయంతో శాలినిని దారుణంగా చంపిందని.. ఆ తరువాత అమర్‌నాథ్ కొంతమంది సాయంతో శాలిని శరీరాన్ని సంచిలో చుట్టి బొటానికల్ గార్డెన్స్ దగ్గర పడేశాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో అన్ని వివరాలు తెలుసుకున్న పోలీసులు మమత ఝా, అనిల్ ఝా, అమర్‌కాంత్‌ను అరెస్ట్ చేయగా.. పింకి ప్రియుడు వికాస్‌ పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ విషయంపై స్పందించిన సీపీ సందీప్ శాండిల్య.. దాదాపు 150 సీసీ కెమెరాలలో ఉన్న వీడియోలను పరిశీలించి ఈ కేసును చేధించామని.. దీన్ని చేధించడంలో భాషా, మజీద్ అనే కానిస్టేబుల్స్‌ కీలకంగా వ్యవహరించారని ప్రశంసించారు.

English Title
CP about Botanical garden Murder Case
Related News